‘వారి వల్లే ఇన్నాళ్లూ ఓటుహక్కు కోల్పోయారు’

తాజా వార్తలు

Updated : 06/12/2020 19:50 IST

‘వారి వల్లే ఇన్నాళ్లూ ఓటుహక్కు కోల్పోయారు’

శ్రీనగర్‌: పాకిస్థాన్‌ నుంచి భారత్‌కు వచ్చిన శరణార్థులకు కశ్మీర్‌‌లోని రాజకీయ పార్టీలు ఇన్నాళ్లూ ఓటు హక్కు కల్పించలేదని కేంద్రమంత్రి స్మృతి ఇరానీ ఆరోపించారు. కానీ అలాంటివారికి మోదీ ప్రభుత్వం ఆ అవకాశం కల్పించిందని ఇరానీ వెల్లడించారు. కశ్మీర్‌ స్థానిక సంస్థల ఎన్నికలకు స్టార్‌ ప్రచారకర్తగా ఉన్న ఆమె ఆదివారం మాట్లాడుతూ.. ఇటీవల అక్కడ ఏర్పాటైన గుప్‌కార్‌ డిక్లరేషన్‌పై తీవ్ర విమర్శలు చేశారు.  ‘గుప్‌కార్‌ గ్యాంగ్‌ తమ చేతిలో అధికారం ఉన్నప్పుడు శరణార్థులకు ఓటు హక్కు కల్పించలేదు. పాక్‌ను కాదని హిందుస్థాన్‌ను ఎంచుకున్న శరణార్థి కుటుంబాల పరిస్థితిని ప్రధాని నరేంద్రమోదీ అర్థం చేసుకున్నారు. అందుకే వారికి మోదీ ఓటు హక్కు కల్పించారు. ప్రజలకు అవసరమైనపుడు ఈ పార్టీలు ఏకం కావు. కానీ అనవసరమైన సమయంలో వారు ఇప్పుడు ఏకమవుతున్నారు’ అని ఆమె ఆ రాజకీయ పార్టీల కూటమిపై విమర్శలు చేశారు. 

జమ్మూకశ్మీర్‌కు ప్రత్యేక హోదా కల్పించే ఆర్టికల్‌ 370ని తిరిగి పునరుద్ధరించాలంటూ పీడీపీ, ఎన్సీ సహా పలు రాజకీయ పార్టీలు పీపుల్స్‌ అలయన్స్‌గా ఏర్పాటైన విషయం తెలిసిందే. ఈ క్రమంలో పీడీపీ నాయకురాలు మెహబూబా ముఫ్తీ, ఎన్సీ నాయకుడు ఫరూఖ్‌ అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కశ్మీర్‌కు ఆర్టికల్‌ 370 పునరుద్ధరణకు చైనా సాయం కోరతామని అబ్దుల్లా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కాగా కేంద్ర ప్రభుత్వం గతేడాది పౌరసత్వ సవరణ చట్టాన్ని తీసుకువచ్చిన విషయం తెలిసిందే. పాక్‌, అఫ్గన్‌..తదితర దేశాల్లో మైనారిటీలుగా ఉండి హింసకు గురై శరణార్థులుగా భారత్‌కు వచ్చిన వారికి ఆ చట్టం ద్వారా ఓటు హక్కు వస్తుంది. కశ్మీర్‌ కేంద్ర పాలనలోకి వచ్చిన తర్వాత ఆ చట్టాన్ని అక్కడ అమలు చేశారు.  

ఇదీ చదవండి

టీకా కోసం తొక్కిసలాట జరగొచ్చు: డబ్ల్యూహెచ్‌వో


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని