బైడెన్‌కు భద్రత పెంపు..

తాజా వార్తలు

Updated : 06/11/2020 16:06 IST

బైడెన్‌కు భద్రత పెంపు..

ఏర్పాట్లు చేస్తున్న సీక్రెట్‌ సర్వీస్‌! 

వాషింగ్టన్‌ : అమెరికా తదుపరి అధ్యక్షుడు ఎవరనే విషయంపై ఉత్కంఠ  కొనసాగుతూనే ఉంది. పలు చోట్ల  కౌంటింగ్‌ ప్రక్రియ ఇంకా కొనసాగుతుండటంతో అమెరికా అధ్యక్ష పీఠం ఎవరికి దక్కనుందని  ప్రపంచదేశాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి. అయితే ఇప్పటికే మ్యాజిక్‌ ఫిగర్‌కి చేరువగా వచ్చిన డెమొక్రాటిక్‌ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్‌ విజయం ఖాయమని ఆయన ప్రచార వర్గం ధీమా వ్యక్తం చేస్తోంది. అందుకు తగ్గట్లు బైడెన్‌కు భద్రతను పెంచుతున్నట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

బైడెన్‌ భద్రతను పెంచేందుకు అమెరికా సీక్రెట్ సర్వీసు సంస్థ అధికారులను పంపించినట్లు వాషింగ్టన్‌ పోస్టు పత్రిక పేర్కొంది. విల్మింగ్టన్‌ కన్వెన్షన్‌ సెంటర్‌ వేదికగా బైడెన్‌ శుక్రవారం కీలక ప్రసంగం చేసే అవకాశం ఉందని.. దీంతో ఆయనకు భద్రత కల్పించేందుకు సీక్రెట్‌ సర్వీస్‌ ఏర్పాట్లు చేస్తోందని ఈ ప్రణాళికల్లో భాగమైన ఇద్దరు అధికారులు చెప్పినట్లు వెల్లడించింది. తన ప్రసంగానికి విల్మింగ్టన్‌ సెంటర్‌ను ఉపయోగించుకునే అవకాశం ఉందని బైడన్‌ ప్రచార వర్గం సీక్రెట్‌ సర్వీస్‌కు సమాచారం ఇచ్చిందని.. ఈ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని తెలుస్తోంది.

ప్రస్తుతం ఐదు కీలక రాష్ట్రాల్లో కౌంటింగ్‌ కొనసాగుతోంది.  దాదాపు అన్ని రాష్ట్రాల్లో అభ్యర్థుల మధ్య తేడా స్వల్పంగానే ఉంది.

ఇవీ చదవండి..

ట్రంప్‌ అనుకున్నదంతా అవుతోంది..!

అమెరికా 2020: 120ఏళ్లలోనే అత్యధిక ఓటింగ్‌Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని