బౌద్ధ గ్రంథాలయం ఏర్పాటు చేయాలి..

తాజా వార్తలు

Published : 21/12/2020 23:30 IST

బౌద్ధ గ్రంథాలయం ఏర్పాటు చేయాలి..

భారత్‌-జపాన్‌ సంవాద్‌ కాన్ఫరెన్స్‌లో సందేశమిచ్చిన మోదీ

దిల్లీ: ఆధునిక ప్రపంచం ఎదుర్కొంటున్న సవాళ్లను అధిగమించేందుకు బుద్ధుడి బోధనలు ఉపకరించేలా పరిశోధనలు జరగాలని ప్రధాని నరేంద్ర అన్నారు. భారత్‌-జపాన్‌ సంవాద్‌ కాన్ఫరెన్స్‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రధాని తన సందేశాన్ని వినిపించారు. ఈ సంవాద్‌కు మద్దతిస్తున్న జపాన్‌ ప్రభుత్వానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంవాద్‌ సానుకూల ధోరణి, ఐకమత్యం, కరుణను విశ్వవ్యాప్తం చేస్తుందని మోదీ అభిప్రాయపడ్డారు. బుద్ధుని బోధనలు భారత్‌ నుంచి ప్రపంచం నలుమూలలా విస్తరించాయని గుర్తుచేశారు. బౌద్ధ సాహిత్యం, గ్రంథాలను ఒకే చోట చేర్చే విధంగా లైబ్రరీ ఏర్పాటు చేద్దామని సంవాద్‌లో ప్రధాని ప్రతిపాదించారు. 

‘సంప్రదాయ బౌద్ధ సాహిత్యం, గ్రంథాలతో లైబ్రరీ ఏర్పాటుకు ప్రతిపాదిస్తున్నా. ఆ వేదికను భారత్‌లో ఏర్పాటుచేసి అందుకు తగిన వనరులను కల్పిస్తాం. ఆ లైబ్రరీ వివిధ దేశాలనుంచి బౌద్ధసాహిత్యానికి సంబంధించిన అన్ని డిజిటల్‌ కాపీలను సేకరిస్తుంది. బౌద్ధ సన్యాసులు, విద్యార్థులు స్వేచ్ఛగా ఉపయోగించుకునేలా ఆ కాపీలను తర్జుమా చేయడమే ఆ లైబ్రరీ లక్ష్యం’ అని మోదీ అన్నారు. మానవులు-సమాజం, మనుషులు-ప్రకృతి మధ్య నిజమైన సంవాదంపై పరిశోధన, చర్చ జరిగే వేదికగా ఆ లైబ్రరీ నిలుస్తుందని ప్రధాని పేర్కొన్నారు.

ఇవీ చదవండి...

రైతు చట్టాలను చదవండి.. షేర్‌ చేయండి

‘భారత్‌ ఎందుకు’ అనుకున్న వారే ఇప్పుడు..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని