కేరళలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు: కేంద్రం

తాజా వార్తలు

Published : 01/11/2020 22:37 IST

కేరళలో పెరుగుతున్న యాక్టివ్‌ కేసులు: కేంద్రం

దిల్లీ: దేశంలో వరుసగా మూడో రోజూ కరోనా వైరస్‌ పాజిటివ్‌ కేసులు 6లక్షల కంటే తక్కువే ఉన్నాయని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ఈ మేరకు అధికారులు ఆదివారం మీడియా సమావేశంలో తెలిపారు. ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించిన ప్రకారం.. ‘ప్రపంచ దేశాలతో పోలిస్తే మిలియన్‌ జనాభాకు గానూ అత్యధిక కరోనా వైరస్‌ కేసులు నమోదవుతున్న జాబితాలో భారత్‌ చివరి స్థానంలో ఉంది. వరుసగా మూడో రోజు దేశంలో కరోనా వైరస్‌ యాక్టివ్‌ కేసుల సంఖ్య ఆరు లక్షల కంటే తక్కువగా ఉంది. ప్రస్తుతం 5.70లక్షల యాక్టివ్‌ కరోనా వైరస్‌ కేసులున్నాయి. కరోనాకు వ్యతిరేకంగా కేంద్ర వ్యూహాలతో కలిసి రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సంయుక్తంగా టెస్టింగ్‌, ట్రేసింగ్‌, చికిత్స విధానాన్ని అనుసరించినందుకే మంచి ఫలితాలు వచ్చాయి. దేశంలో కరోనా వైరస్‌ కారణంగా సంభవిస్తున్న మరణాల సంఖ్య కూడా తగ్గుముఖం పట్టింది. గత 24గంటల్లో 470 మంది మహమ్మారి కారణంగా మరణించారు. మిలియన్‌ జనాభాకు గానూ భారత్‌లో కరోనా కారణంగా మరణిస్తున్న వారి సంఖ్య 88. ఇది ప్రపంచ దేశాలతో పోలిస్తే ఎంతో తక్కువ ’అని ఆరోగ్య శాఖ పేర్కొంది. 

కరోనా వైరస్‌ జాతీయ రికవరీ రేటు 91.54శాతానికి చేరుకుంది. గడిచిన 24గంటల్లో 46వేల కరోనా కేసులు నమోదు కాగా.. 58వేల మంది రికవరీ అయ్యారు. రికవరీల్లో 76శాతం కేసులు కేవలం 10 రాష్ట్రాల్లోనే ఉన్నాయి. కేరళలో ఇప్పటికీ అధికంగానే కేసులు నమోదవుతున్నాయి. తాజాగా 7వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. మహారాష్ట్ర, దిల్లీల్లో 5వేలకు పైగా కేసులు నమోదయ్యాయి. తాజా మరణాల్లో 78శాతం 10 రాష్ట్రాల్లోనే సంభవించాయి. కాగా దేశంలో ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య 81లక్షలకు చేరింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని