కరోనా క్రియాశీలకేసులు తగ్గుతున్నాయి..

తాజా వార్తలు

Published : 12/12/2020 23:17 IST

కరోనా క్రియాశీలకేసులు తగ్గుతున్నాయి..

3.66శాతంగా ఉందని వెల్లడించిన ఆరోగ్య మంత్రిత్వ శాఖ

దిల్లీ: దేశంలో క్రియాశీల కేసులు సంఖ్య 3.6 లక్షలకు పడిపోయిందని, ప్రస్తుతం ఆ రేటు 3.66 శాతంగా ఉందని శనివారం కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో వెల్లడించింది. వైరస్ బారిన పడుతున్నవారి సంఖ్య కంటే రికవరీలు ఎక్కువగా ఉండటం, మరణాల సంఖ్య తక్కువగా ఉండటం వల్లే క్రియాశీల కేసుల్లో ఈ తగ్గుదలకు కారణమని వెల్లడించింది. 

దేశంలోని మొత్తం పాజిటివ్ కేసుల్లో క్రియాశీల కేసుల శాతం 3.66(3,59,819)గా ఉందని మంత్రిత్వ శాఖ తెలిపింది. గడిచిన 24గంటల్లో 33,494 మంది కోలుకోవడంతో..క్రియాశీల కేసుల్లో(3,930) తగ్గుదలకు దారితీసిందని తెలిపింది. వైరస్‌తో అత్యంత ప్రభావితమైన మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, పశ్చిమ బెంగాల్, ఉత్తర్‌ప్రదేశ్‌, దిల్లీ వంటి రాష్ట్రాల్లో గత వారం రోజుల్లో సగటున రోజూవారీ కేసుల్లో తగ్గుదల కనిపిస్తోందని పేర్కొంది. అలాగే గత 15 రోజులుగా రోజూవారీ కేసుల కంటే రికవరీలే ఎక్కువగా ఉన్నాయని మంత్రిత్వ శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అలాగే గత ఏడు రోజులుగా మరణాల సంఖ్య కూడా 500లకు దిగువనే ఉంటుందని కూడా తెలిపింది. ఇదిలా ఉండగా..ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా వైరస్ సోకిన వారి సంఖ్య 98 లక్షల మార్కును దాటేసింది. గడిచిన 24 గంటల్లో 30,006 మంది వైరస్ బారిన పడగా..442 మరణాలు సంభవించాయి. 

ఇవీ చదవండి:

మహమ్మారులకు టీకాల చెక్‌

కరోనా: కోలుకుంటోన్న భారత్


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని