విస్కాన్సిన్‌లో గెలుపొందిన బైడెన్‌

తాజా వార్తలు

Updated : 05/11/2020 03:18 IST

విస్కాన్సిన్‌లో గెలుపొందిన బైడెన్‌

రీకౌంటింగ్‌ చేపట్టాలన్న ట్రంప్‌

ఇంటర్నెట్‌డెస్క్‌: అగ్రరాజ్యం అమెరికాలో ఎన్నికల ఫలితాలు తీవ్ర ఉత్కంఠను రేపుతున్నాయి. అధ్యక్షుడు ట్రంప్‌, ప్రత్యర్థి బైడెన్‌లు హోరాహోరీగా తలపడుతున్నారు. తాజాగా డెమొక్రటిక్‌ అధ్యక్ష అభ్యర్థి బైడెన్‌ కీలక రాష్ట్రమైన విస్కాన్సిన్‌లో గెలుపొందారు. అయితే అధ్యక్షుడు ట్రంప్‌ రీకౌంటింగ్‌ చేపట్టాలని తెలిపారు. ఫలితాల్లో అనేక సందేహాలు ఉన్నాయని వెంటనే రీకౌంటింగ్‌ చేపట్టాలని ట్రంప్‌ సూచించినట్లు రిపబ్లిక్‌ ప్రచార నిర్వాహకుడు పేర్కొన్నారు. 538 ఎలక్టోరల్‌ ఓట్లలో ప్రస్తుతం ట్రంప్‌ 214 గెలుచుకోగా, ప్రత్యర్థి బైడెన్‌ 237 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించారు. మ్యాజిక్‌ ఫిగర్‌కు 270 ఎలక్టోరల్‌ ఓట్లు సాధించాల్సి ఉంది. మరోవైపు మిషిగాన్‌, నెవాడా, అరిజోనాలో బైడెన్‌ ముందంజలో ఉన్నారు. జార్జియా, నార్త్‌ కరోలినాలో ట్రంప్‌ ఆధిక్యంలో ఉన్నారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని