ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ: కేటీఆర్‌

తాజా వార్తలు

Updated : 22/07/2020 02:32 IST

ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీ: కేటీఆర్‌

కరీంనగర్‌: ఐటీ రంగంలో తెలంగాణ రాష్ట్రం రెండో స్థానంలో ఉందని ఐటీశాఖ మంత్రి కేటీఆర్‌ తెలిపారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి పట్టణాలకు ఐటీ సేవలు విస్తరించాలని అన్నారు. కరీంనగర్‌లో రూ.34 కోట్ల వ్యయంతో నిర్మించిన ఐటీ హబ్‌ను మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ టవర్‌లోని కంపెనీల్లో ఎంపికైన వారికి నియామక పత్రాలు అందేజేశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌  మాట్లాడుతూ.. తెలంగాణ ఏర్పడినప్పుడు ఐటీ పురోభివృద్ధిపై పలు అనుమానాలు ఉండేవని అన్నారు. అప్పట్లో ఐటీ ఎగుమతులు తక్కువగా ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్లలో రెట్టింపు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని, ప్రస్తుతం ఐటీ ఎగుమతులు రూ.1.28 లక్షల కోట్లకు చేరాయని తెలిపారు. 

ఐటీ నిర్వచనం క్రమంగా మారుతోందని కేటీఆర్‌ అభిప్రాయడ్డారు. ఐటీ అంటే ఇంటెలిజెంట్‌ టెక్నాలజీగా మంత్రి అభివర్ణించారు. ‘‘ కరోనా నియంత్రణలో తెలంగాణ కీలక పాత్ర పోషిస్తోంది. ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ ద్వారా మాస్కులు ధరించారా? లేదా? తెలుస్తుంది. నైపుణ్యం ఏ ఒక్కరి సొత్తు కాదు. పట్టణాలు, గ్రామీణ యువత ఐటీలో సత్తా చాటుతోంది. స్థానిక స్టార్టప్‌లను అధికారులు ప్రోత్సహించాలి’’ అని కేటీఆర్‌  పేర్కొన్నారు.

కరీంనగర్‌లో టాస్క్‌, టీహబ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు కేటీఆర్‌ చెప్పారు. పోటీ ప్రపంచంలో ఎప్పటికప్పుడు కొత్త నైపుణ్యాలు నేర్చుకోవాలని కోరారు. పోటీ ప్రపంచంలో స్కిల్‌, అప్‌స్కిల్‌, రీస్కిల్‌ పెంపొందించుకోవాలన్నారు. తాను కూడా కరీంనగర్‌లోనే పుట్టానని, ఇక్కడే చదువుకున్నానని మంత్రి గుర్తు చేసుకున్నారు. ‘‘ అప్పట్లో చూసిన కరీంనగర్‌కు ఇప్పటికి  పోలికలే లేవు. కరీంనగర్‌ అందమైన నగరంగా ఎదుగుతోంది’’ అని కేటీఆర్‌ అన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని