పోలీసు సవరణ చట్టంపై వెనక్కి తగ్గిన కేరళ!

తాజా వార్తలు

Published : 24/11/2020 23:51 IST

పోలీసు సవరణ చట్టంపై వెనక్కి తగ్గిన కేరళ!

కొచ్చి: కేరళ ప్రభుత్వం ఇటీవల తీసుకువచ్చిన వివాదాస్పద పోలీస్‌ సవరణ చట్టంపై మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఆ చట్టం స్వేచ్ఛాయుత ప్రసంగాలకు భంగం కలిగించేలా ఉందని ప్రతిపక్షాల నుంచి ఆందోళనలు వెల్లువెత్తిన తరుణంలో దాన్ని వెనక్కి తీసుకునేందుకు మొగ్గుచూపింది. ఇందుకోసం గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌కు సెక్షన్‌ 118-ఎ రద్దు చేయమని ఆర్డినెన్స్‌ జారీ చేసేలా నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ప్రత్యేక కేబినెట్‌ కమిటీ మంగళవారం నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 

పోలీసు చట్టంలో సవరణలు చేస్తూ కేరళ ప్రభుత్వం ప్రతిపాదించిన బిల్లుపై ఆ రాష్ట్ర గవర్నర్‌ ఆరిఫ్‌ మొహమ్మద్‌ గత ఆదివారం సంతకం చేసిన విషయం తెలిసిందే. ఈ సవరణ చట్టం ప్రకారం.. మహిళలు లేదా ఇతరులపై ఎవరైనా సామాజిక మాధ్యమాల్లో అనుచిత, అసభ్య వ్యాఖ్యలు చేస్తే వారు శిక్షార్హులుగా పరిగణలోకి వస్తారు. అలాంటి చర్యలకు పాల్పడిన వారికి మూడేళ్ల జైలు శిక్షతో పాటు, రూ.10వేల జరిమానా విధిస్తారు.  దీంతో ఈ చట్టంపై కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకులు చిదంబరం, శశిథరూర్‌ సహా పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ చట్టం ద్వారా స్వేచ్ఛాయుత ప్రసంగానికి, మీడియా స్వేచ్ఛకు భంగం కలిగే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని