భారత్‌లో యాక్టివ్‌ కేసులు ఎక్కడ పెరుగుతున్నాయ్?

తాజా వార్తలు

Published : 03/11/2020 21:45 IST

భారత్‌లో యాక్టివ్‌ కేసులు ఎక్కడ పెరుగుతున్నాయ్?

ఇంటర్నెట్ డెస్క్‌: భారత్‌లో కరోనా మహమ్మారి ఉద్ధృతి తగ్గినట్టు కనబడుతున్నప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో మాత్రం రోజురోజుకీ కొత్త కేసులు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. దేశ వ్యాప్తంగా ఇప్పటివరకు 11 కోట్లకు పైగా కొవిడ్ నిర్ధారణ పరీక్షలు చేసినట్టు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్‌ వెల్లడించారు. ఈ వైరస్‌తో పోరాడి కోలుకున్నవారి సంఖ్య 76లక్షల మార్కును దాటిందని, ప్రపంచంలోనే ఈ సంఖ్య అధికమని తెలిపారు. దేశంలో కరోనా పరిస్థితిపై మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘దేశంలో మొత్తం పాజిటివిటీ రేటు 7.4% కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.4%, రోజువారీ పాజిటివిటీ రేటు 3.7%గా ఉంది. రికవరీ రేటు దాదాపు 92%గా ఉంది. దేశంలో ప్రస్తుతం 5.41లక్షల క్రియాశీల కేసులు మాత్రమే ఉన్నాయి’’ అని వివరించారు.

యాక్టివ్‌ కేసులు ఎక్కడ పెరిగాయ్‌..
అక్టోబర్‌ 3నాటితో పోలిస్తే నవంబర్‌ 3 నాటికి పలు కీలక రాష్ట్రాల్లో యాక్టివ్‌ కేసుల సంఖ్య తగ్గగా.. మరికొన్ని రాష్ట్రాల్లో వీటి సంఖ్య పెరిగినట్టు కేంద్రం విడుదల చేసిన గణాంకాలు సూచిస్తున్నాయి. కొవిడ్‌ ప్రభావం అధికంగా ఉన్న రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధప్రదేశ్‌, తమిళనాడు, ఉత్తర్‌ ప్రదేశ్‌లలో అక్టోబర్‌తో పోలిస్తే క్రియాశీల కేసుల తగ్గుదల నమోదవగా.. మణిపూర్‌, దిల్లీ, కేరళ, పశ్చిమబెంగాల్‌లో వీటిలో పెరుగుదల కనబడటం గమనార్హం.


అలాగైతేనే ఎదుర్కోగలం
అలాగే, ప్రతి మిలియన్‌ జనాభాకు గాను దేశంలో 5,991 పాజిటివ్‌ కేసులు నమోదవుతుండగా.. ప్రపంచంలో సగటున ఈ సంఖ్య 5,944గా ఉంది. మరణాల విషయానికి వస్తే ప్రతి మిలియన్‌ జనాభాలో కొవిడ్‌తో 89 మంది భారత్‌లో ప్రాణాలు కోల్పోతుంటే.. ప్రపంచ సగటు 154గా ఉంది. కొవిడ్‌ ప్రభావం తీవ్రంగా ఉన్న బ్రెజిల్‌, అమెరికా, ఫ్రాన్స్‌, యూకే, దక్షిణాఫ్రికా, రష్యాలతో పోలిస్తే భారత్‌లో ఈ సంఖ్య తక్కువే.  టెస్ట్‌, ట్రాక్‌ ,ట్రేస్‌, ట్రీట్‌ అనే వ్యూహాన్ని కొనసాగించడం ఎంతో అవసరం. కరోనా కేసులు తగ్గుతున్నప్పటికీ ఈ వ్యూహంపైనే ప్రధానంగా దృష్టిపెట్టాలి. పండగ సీజన్‌ ఇంకా పూర్తి పూర్తికాలేదు. కరోనా మార్గదర్శకాలను పాటిస్తే కరోనా వ్యాప్తిని నివారించగలం’’ అని రాజేశ్‌ భూషణ్‌ తెలిపారు.


గత ఏడు వారాలుగా దేశంలో రోజూ నమోదవుతున్న కొత్త కేసుల్లో తగ్గుదలను సూచించే గ్రాఫ్‌..


గత ఏడు వారాలుగా దేశంలో ప్రతి రోజు నమోదయ్యే కొవిడ్‌ మరణాల్లో తగ్గుదలను ఈ గ్రాఫ్‌లో గమనించవచ్చు. 


 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని