కరోనా బారినపడకుండా అప్రమత్తత ముఖ్యం: కేంద్రం

తాజా వార్తలు

Updated : 11/10/2020 19:14 IST

కరోనా బారినపడకుండా అప్రమత్తత ముఖ్యం: కేంద్రం

దిల్లీ: దేశంలో త్వరలో పండగ సీజన్‌ మొదలవనున్న నేపథ్యంలో కేంద్రం ప్రజలనుద్దేశించి కీలక సూచనలు చేసింది. కరోనా వైరస్‌ నేపథ్యంలో దేశ ప్రజలు ఈ ఏడాది సాధారణ రీతిలో పండగలు జరుపుకోవాలని.. భారీ సంఖ్యలో సమావేశాలు కావడం వంటివి ఆపాలని కోరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రి హర్షవర్దన్‌ సామాజిక మాధ్యమ వేదికగా నిర్వహించిన ‘సండే సంవాద్‌’లో మాట్లాడారు. ‘కరోనా వైరస్‌పై ప్రపంచం మొత్తం పోరాటం చేస్తుంది. అందులో భాగంగా ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలో భారత్‌ ఇంకా దీటుగా వైరస్‌పై పోరాటాన్ని కొనసాగిస్తోంది. జన్‌ ఆందోళన్‌(పబ్లిక్‌ మూవ్‌మెంట్) ప్రారంభించినందుకు ఆయనకు ధన్యవాదాలు. ప్రస్తుతం అన్నింటికంటే మనముందు ఉన్న ప్రధాన ధర్మం కొవిడ్‌పై పోరాటమే. ఈ పోరాటంలో ప్రజలంతా ప్రభుత్వానికి సహకరించాలి’అని హర్షవర్దన్‌ తెలిపారు. 

పండగల గురించి హర్షవర్దన్‌ మాట్లాడుతూ.. ‘ప్రజలు భారీ సంఖ్యలో హాజరై, ఆడంబరంగా పండగలు చేసుకోవాలని ఏ మతం లేదా దేవుడు చెప్పలేదు. కాబట్టి అందరూ కొవిడ్‌ను దృష్టిలో పెట్టుకుని ఆ విధంగా పండగలు జరుపుకునే విషయంలో అప్రమత్తత వహించాలి. ఉదాహరణకు ఇటీవల కేరళలో ఓనం పండగ నిర్వహించిన అనంతరం అక్కడ కరోనా వైరస్‌ కేసుల స్థాయి బాగా పెరిగింది. ఇలా పండగల్ని భారీ సంఖ్యలో గుమిగూడి జరుపుకున్న అన్ని రాష్ట్రాల్లోనూ కేసుల్లో పెరుగుదల కనిపించింది. కాబట్టి రానున్న పండగల విషయంలో అందరూ జాగ్రత్తలు వహించాలి. కరోనా వైరస్‌ను నివారించడానికి ప్రతి ఒక్కరూ సామాజిక దూరాన్ని తప్పనిసరిగా పాటించాలి’ అని ఆయన మరోసారి సూచించారు. 

ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్‌ కేసుల్లో భారత్‌ రెండో స్థానంలో ఉంది. భారత్‌లో ఇప్పటివరకూ మొత్తం దాదాపు 70లక్షల కేసులు నమోదయ్యాయి. వారిలో 60లక్షల మంది రికవరీ కాగా.. లక్ష మంది దాకా మరణించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని