3 పొరల మాస్కు 3 రూపాయలకే..

తాజా వార్తలు

Published : 21/10/2020 13:50 IST

3 పొరల మాస్కు 3 రూపాయలకే..

మాస్కుల ధరలను నిర్ణయించిన మొట్టమొదటి రాష్ట్రంగా మహారాష్ట్ర

ముంబయి: కరోనా వ్యాప్తి సమయంలో మాస్కులను అధిక ధరలకు విక్రయించకూడదంటూ మహారాష్ట్ర ప్రభుత్వం మార్గనిర్దేశకాలు జారీ చేసింది. రెండు, మూడు పొరలున్న మాస్కులను రూ.3 నుంచి రూ.4కే విక్రయించాలని నిర్ణయించింది. నాణ్యతను బట్టి ఎన్‌95 మాస్కులను రూ.19 నుంచి రూ.49 మధ్యలోనే విక్రయించాలని పేర్కొంది. ఈ నిర్ణయంతో మాస్కుల ధరలను నిర్ణయించిన తొలి రాష్ట్రంగా అవతరించింది. రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి రాజేశ్‌ తోపే మాట్లాడుతూ.. ‘కరోనా సంక్రమణను కట్టడించేందుకు ప్రతి ఒక్కరు కచ్చితంగా మాస్కు ధరించాలి. ధరించని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నాం. ఈ నేపథ్యంలోనే అందరు మాస్కులు ధరించేలా తక్కువ ధరలకే వాటిని విక్రయించేలా మార్గనిర్దేశకాలు జారీ చేశాం. ఇందుకు ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి కూడా ఆమోదం తెలిపారు’ అని ఆయన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాష్ట్రంలో అంటువ్యాధుల చట్టం అమలులో ఉన్నంతకాలం తయారీ సంస్థలు, పంపిణీదారులు, విక్రేతలు ఈ మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాలని సూచించారు.

దేశంలోని అన్ని రాష్ట్రాలతో పోలిస్తే మహారాష్ట్రలోనే అత్యధికంగా కరోనా కేసులు నమోదయ్యాయి. మంగళవారం నమోదైన 8,151 కేసులతో కలిపి ఇప్పటి వరకు 16,09,516 మంది వైరస్‌బారిన పడ్డారు. ప్రస్తుతం 1,74,265 యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. 42240 మంది వ్యాధి సోకి మృతిచెందారు.
 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని