వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: మమత

తాజా వార్తలు

Published : 11/12/2020 01:28 IST

వారు నియంతల్లా వ్యవహరిస్తున్నారు: మమత

కోల్‌కతా: భాజపా నాయకత్వాన్ని నియంతలు అడాల్ఫ్‌ హిట్లర్‌, ముస్సోలినీలతో పోల్చుతూ పశ్చిమబెంగాల్‌ సీఎం మమతాబెనర్జీ తీవ్ర విమర్శలు చేశారు. అంతేకాకుండా భాజపా జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా కాన్వాయ్‌పై జరిగిన రాళ్ల దాడిని వారే ఆడిన నాటకంగా ఆమె వర్ణించారు. ఈ మేరకు తమ పార్టీ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన రైతుల నిరసన కార్యక్రమంలో ఆమె మాట్లాడారు.  

‘రాష్ట్రానికి బయటి నుంచి కొందరు వ్యక్తులు వచ్చి మాపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. భాజపా నాయకులు హిట్లర్‌, ముస్సోలినీ తరహాలో నియంతల్లా వ్యవహరిస్తున్నారు. మోదీ ప్రభుత్వం ప్రజాస్వామ్య సూత్రాలకు, రాజ్యాంగానికి కట్టుబడి లేదు. రాష్ట్రాల అధికార పరిధిని కేంద్రం ఆక్రమిస్తోంది. రాజీవ్‌గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు 400 మంది ఎంపీల బలం ఉన్నా అలాంటి ప్రయత్నాలు చేయలేదు. కానీ భాజపా 300 ఎంపీల బలంతో చట్టాలను చేతిలోకి తీసుకుని సామాన్య మానవుడిని ఇబ్బందులకు గురిచేస్తోంది. కేంద్రం ఇప్పుడు ఆంఫన్‌ తుఫాన్‌ సహాయ నిధి గురించి మా ప్రభుత్వాన్ని అకౌంట్స్‌ అడుగుతోంది. ముందు పీఎం కేర్స్‌ నిధులు ఏమవుతున్నాయో వారు చెప్పాలి. రైతుల ప్రయోజనాలకు వ్యతిరేకంగా ఉన్న వ్యవసాయ చట్టాలను కేంద్రం వెంటనే వెనక్కి తీసుకోవాలి. రైతుల కోసం ప్రజలంతా ఐక్యతగా ఉండాలి. భాజపా నాయకులు వారికి వ్యతిరేకంగా ఎవరైనా ఉద్యమాలను చేస్తే అణచివేయడానికి పథకం సిద్ధం చేసుకున్నారు. అందులోభాగంగానే రైతుల ఉద్యమాన్ని నీరుగార్చాలని చూస్తున్నారు ’ అని మమతా బెనర్జీ భాజపాపై విమర్శలు చేశారు.  

ఇవీ చదవండి..

బెంగాల్‌ ఘటనపై విచారణకు అమిత్‌ షా ఆదేశం

జేపీ నడ్డా కాన్వాయ్‌పై రాళ్ల దాడి


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని