పుల్వామా దాడి.. ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు

తాజా వార్తలు

Updated : 25/08/2020 18:30 IST

పుల్వామా దాడి.. ఎన్‌ఐఏ ఛార్జ్‌షీట్‌ దాఖలు

దిల్లీ: పుల్వామా ఉగ్రదాడి కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ).. ఉగ్రవాద సంస్థ జైషే అధినేత మసూద్‌ అజార్‌ పేరును ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. ఫిబ్రవరి 14, 2019న చోటుచేసుకున్న ఈ ఆత్మాహుతి దాడి కేసులో ఇప్పటికే పోలీసుల అదుపులో ఉన్న ఆరుగురు కాకుండా...మసూద్‌ అజార్‌, అతడి సోదరుడు అబ్దుల్‌ రవూఫ్‌ అస్ఘర్‌‌, మరణించిన ఉగ్రవాది మొహమ్మద్‌ ఉమర్ ఫరూఖ్‌, ఆత్మాహుతి దళ సభ్యుడు అదిల్‌ అహ్మద్‌ దార్‌, అల్వీ, ఇస్మాయిల్‌ తదితర పాక్‌ మూలాలు కలిగిన 20 మంది పేర్లు ఛార్జ్‌షీట్‌లో ఉన్నట్టు తెలిసింది. 26/11 ముంబయి దాడులలాంటి కేసుల్లో అజార్‌ నిందితుడుగా ఉన్న విషయం తెలిసిందే.

భద్రతా బలగాల వాహన శ్రేణిని పేలుడుపదార్థాలు నింపిన కారుతో ఢీకొన్న నాటి ఘటనలో.. 40 మందికి పైగా భారత సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో 5000 పేజీలతో కూడిన ఛార్జ్‌షీట్‌ను నేడు జమ్ములోని ఓ ప్రత్యేక న్యాయస్థానంలో ఎన్‌ఐఏ దాఖలు చేసింది.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని