close
Array ( ) 1

తాజా వార్తలు

Published : 03/06/2020 12:20 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

కరోనా ధాటికి ముంబయి విలవిల..!

వైద్యులపై పెరుగుతున్న ఒత్తిడి..!

ముంబయి: కరోనా వైరస్‌ మహమ్మారి మహారాష్ట్రను అతలాకుతలం చేస్తోంది. ప్రతిరోజు ఇక్కడ కొత్తగా 2వేలకు పైగా పాజిటివ్‌ కేసులు బయటపడుతున్నాయి. గడచిన 24గంటల్లో రాష్ట్రంలో 2287కేసులు, 103మరణాలు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 72,300కి చేరింది. వీరిలో ఇప్పటి వరకు 2465మంది మృత్యువాతపడ్డారు. ఇక్కడ నమోదవుతున్న కేసుల్లో దాదాపు 58శాతం ముంబయి మహానగరంలోనే చోటుచేసుకుంటున్నాయి. నగరంలో ఇప్పటివరకు 42వేల కరోనా పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. నిన్న ఒక్కరోజే కొత్తగా 1109కేసులు పాజిటివ్‌గా తేలాయి. కేవలం ముంబయి నగరంలోనే కరోనా మరణాల సంఖ్య 1368 దాటింది. నగరంలోని ధారవి ప్రాంతంలో ఇప్పటివరకు 1830 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. ముంబయిలో కొవిడ్‌ చికిత్స అందిస్తోన్న ఆసుపత్రుల్లోని ఐసీయూ పడకలు ఇప్పటికే రోగులతో నిండిపోయాయి. అంతేకాకుండా వైరస్‌ తీవ్రత అధికంగా ఉండడంతో వైద్యులపై తీవ్ర ఒత్తిడి పెరుగుతున్నట్లు కొంద వైద్యసంఘాలు మహారాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి.

కొవిడ్‌ ధాటికి వణికిపోతున్న ముంబయి మహానగరానికి ఇప్పుడు నిసర్గ తుపాన్‌ ముప్పు పొంచిఉంది. తాజా పరిస్థితుల్లో మరో రెండు రోజులపాటు ప్రజలు అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్‌ ఠాక్రే సూచించారు. నిసర్గ ప్రభావంతో ముంబయి నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన దాదాపు 31 విమాన సర్వీసులు రద్దయ్యాయి. అంతేకాకుండా మరికొన్ని రైళ్లపై కూడా దీని ప్రభావం పడనుంది.

దిల్లీలో 1498, తమిళనాడులో 1091 కేసులు..
ఇదిలా ఉంటే, మహారాష్ట్ర అనంతరం కొవిడ్‌ మహమ్మారి దిల్లీ, తమిళనాడు రాష్ట్రాల్లో విలయతాండవం చేస్తోంది. తాజాగా దిల్లీలో నిన్న ఒక్కరోజులోనే 1,498కేసులు నిర్ధారణ అయ్యాయి. రాష్ట్రంలో ఇప్పటి వరకు 556 మంది కొవిడ్‌ సోకిన వారు ప్రాణాలు కోల్పోయారు. దేశంలో కరోనా మరణాల్లో దిల్లీ మూడో స్థానంలో కొనసాగుతోంది. తమిళనాడుతో కరోనా తీవ్రత అంతకంతకూ పెరుగుతోంది. గడచిన 24గంటల్లో 1,091కేసులు వచ్చాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 24,586కి చేరగా వీరిలో 197మంది చనిపోయారు.

గుజరాత్‌లో 1092 మరణాలు..
మహారాష్ట్ర తరువాత అత్యధిక కొవిడ్ మరణాలు గుజరాత్‌లో చోటుచేసుకుంటున్నాయి. రాష్ట్రంలో మొత్తం 17,617మందికి వైరస్‌ సోకగా వీరిలో ఇప్పటివరకు 1,092మంది మృత్యువాతపడ్డారు. నిన్న ఒక్కరోజే 417కొత్త కేసులు, 29మరణాలు నమోదయ్యాయి. మధ్యప్రదేశ్‌లోనూ కరోనా మరణాల సంఖ్య కలవరపెడుతోంది. రాష్ట్రంలో 364మంది ప్రాణాలు కోల్పోయారు. పశ్చిమ బెంగాల్‌లోనూ 335మంది మరణించారు. రాజస్థాన్‌, పశ్చిమ బెంగాల్‌ల్లో నిన్న ఒక్కరోజే కొత్తగా 390 చొప్పున కేసులు నిర్ధారణ అయ్యాయి.

ఇవీ చదవండి..

భారత్‌లో 2లక్షలు దాటిన కేసులు!

ముంబయికి ‘నిసర్గ’ ముప్పు!


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.