శ్వేత సౌధంలో కరోనా కలకలం

తాజా వార్తలు

Published : 12/11/2020 10:40 IST

శ్వేత సౌధంలో కరోనా కలకలం

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడి అధికార నివాసం వైట్‌హౌస్‌లో మరో ఉద్యోగికి కొవిడ్‌-19 సోకినట్టు తెలిసింది. ఆ దేశ పొలిటికల్‌ డైరక్టర్‌ బ్రియాన్‌ జాక్స్‌కు ఇటీవల నిర్వహించిన కరోనా పరీక్షలో పాజిటివ్‌గా నిర్ధారణ అయిందని ఆంగ్ల మీడియా సంస్థలు వెల్లడించాయి. నవంబర్‌ 3న ఎన్నికల అనంతరం శ్వేత సౌధంలో తలెత్తిన తొలి కేసు ఇదే కావటం గమనార్హం. అంతేకాకుండా మరో సలహాదారుకు కూడా కరోనా వైరస్‌ సోకినట్టు మీడియా కథనం. కాగా ఈ వ్యక్తి ఎన్నికల రాత్రి జరిగిన జరిగిన సమావేశాల్లో పాల్గొన్నదీ లేనిదీ నిర్ధారణ కాలేదు.

ఇటీవల కరోనా సోకిన శ్వేత సౌధ సిబ్బందిలో.. చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ మార్క్‌ మెడోస్‌, గృహ, పట్టణాభివృద్ధి మంత్రి బెన్‌ కార్సన్‌, ఆయన సహాయకుడు డేవిడ్‌ బోసీ తదితరులు ఉన్నారు. ఇక అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌, ఆయన సతీమణి మెలానియా, కుమారుడు బారన్‌ ట్రంప్‌లు అక్టోబర్‌లో కొవిడ్‌ బారిన పడ్డారు. కాగా, అధ్యక్షుడు త్వరితంగా కోలుకుని తిరిగి ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని