వైద్య శాస్త్రంలో నోబెల్‌ వీరికే..

తాజా వార్తలు

Updated : 05/10/2020 15:42 IST

వైద్య శాస్త్రంలో నోబెల్‌ వీరికే..

స్టాక్‌హోం: ప్రతిష్ఠాత్మక నోబెల్‌ పురస్కారాల ప్రకటన ప్రారంభమైంది. ఈ ఏడాది వైద్య రంగంలో ముగ్గురిని నోబెల్‌ వరించింది. ‘హెపటైటిస్‌ సీ’ వైరస్‌ గుర్తింపులో కీలక పాత్ర పోషించిన శాస్త్రవేత్తలు హార్వే జే. ఆల్టర్‌, మైఖెల్‌ హాటన్‌, ఛార్లెస్‌ ఎం. రైస్‌లకు ఈ పురస్కారాన్ని ప్రకటించారు. 

హెపటైటిస్‌ లేదా కాలేయంలో మంట.. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మందిని వేధిస్తున్న ప్రధాన ఆరోగ్య సమస్యల్లో ఒకటి. దీని వల్ల ఎంతో మంది కాలేయ క్యాన్సర్‌ బారిన పడుతున్నారు. హెపటైటిస్‌లో ఏ, బీ వైరస్‌ రకాలు ఉండగా.. ఇప్పటికీ చాలా కేసుల్లో సరైన కారణాలు తెలియట్లేదు. దీంతో హార్వే, మైఖేల్‌, ఛార్లెస్‌ ఈ వైరస్‌లపై మరిన్ని పరిశోధనలు చేసి ‘హెపటైటిస్‌ సి’ వైరస్‌ను గుర్తించారు. దీని వల్ల హెపటైటిస్‌కు మందు కనుగొనడం మరింత సులభతరం కావడమేగాక.. ఎంతో మంది ప్రాణాలను వైద్యులు రక్షించగలుగుతున్నారు. ఈ పరిశోధనలకు గానూ వీరికి నోబెల్‌ ప్రకటించారు. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని