హిమాలయాలకు భారీ భూకంప ముప్పు!

తాజా వార్తలు

Published : 23/10/2020 15:57 IST

హిమాలయాలకు భారీ భూకంప ముప్పు!

దిల్లీ: హిమాలయ పర్వత శ్రేణులను వరుస భూకంపాలు కుదిపేసే ముప్పుందని తాజా అధ్యయనమొకటి వెల్లడించింది. ఆ వరుసలో ఒకటైన భారీ భూకంపం సమీప భవిష్యత్తులోనే సంభవించే అవకాశాలున్నాయని తెలిపింది. రిక్టరు స్కేలుపై 8 కంటే ఎక్కువ తీవ్రతతో ముంచుకొచ్చే ఆ ప్రకృతి విపత్తు ధాటికి.. గతంలో ఎన్నడూ లేనంత భారీ స్థాయిలో మరణాలు సంభవిస్తాయని అంచనా వేసింది. ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌-కోల్‌కతా, అమెరికాలోని నెవడా విశ్వవిద్యాలయం పరిశోధకులతో కూడిన బృందం హిమాలయాల్లో మృత్తికా విశ్లేషణ, రేడియోకార్బన్‌ విశ్లేషణ వంటివి చేపట్టింది. ఆ పర్వత శ్రేణుల్లో గతంలో వచ్చిన భూకంపాలను గుర్తించింది. భవిష్యత్తులో రాబోయే విపత్తులనూ అంచనా వేసింది. తాజా అధ్యయనం ప్రకారం.. తూర్పున అరుణాచల్‌ ప్రదేశ్‌ నుంచి పశ్చిమాన పాకిస్థాన్‌ వరకు హిమాలయ పర్వత శ్రేణులంతటా గతంలో భారీ భూకంపాలు వచ్చాయి. భవిష్యత్తులోనూ అవి పునరావృతం కానున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని