అన్‌లాక్‌: అలాచేస్తే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే

తాజా వార్తలు

Published : 01/09/2020 11:30 IST

అన్‌లాక్‌: అలాచేస్తే ప్రమాదాన్ని ఆహ్వానించినట్టే

ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిక

జెనీవా: సరైన నియంత్రణ లేకుండా కొవిడ్‌-19 అన్‌లాక్‌ ప్రక్రియను చేపట్టడం.. ప్రమాదాన్ని కోరి ఆహ్వానించడమే అని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధనోమ్‌ హెచ్చరించారు. అన్‌లాక్‌ సమయంలో కూడా కరోనా వైరస్‌ నియమ నిబంధనలకు కట్టుబడి ఉండాలని ఆయన ప్రపంచ దేశాలకు స్పష్టం చేశారు. గత ఎనిమిది నెలలుగా అమలులో ఉన్న కరోనా ఆంక్షల వల్ల అధిక శాతం ప్రజలు ఇబ్బందులకు గురైనట్లు తాము గమనించామన్నారు. వారు సాదారణ జీవనం గడిపేందుకు ఆతృతతో ఎదురుచూస్తున్నారని డైరక్టర్‌ జనరల్‌ అభిప్రాయపడ్డారు. ప్రపంచ దేశాల సామాజిక, ఆర్థిక వ్యవస్థలు తిరిగి యథాతథ స్థితికి వచ్చేందుకు తాము కూడా మద్దతిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

‘‘చిన్నారులు పాఠశాలలకు, ప్రజలు పని ప్రదేశాలకు వెళ్లే దృశ్యాన్ని చూడాలని మేమూ కోరుకుంటున్నాం.. అయితే ఈ ప్రక్రియ సురక్షితంగా ఉండాలనుకుంటున్నాం’’ అని టెడ్రోస్‌ ఓ సమావేశంలో వెల్లడించారు. కొవిడ్‌ మహమ్మారి అంతరించినట్టు ఏ దేశం నటించలేదని అయన మరోసారి హెచ్చరించారు. కరోనా వైరస్‌ అతి సులభంగా వ్యాపిస్తుందనేది అందరూ గ్రహించాల్సిన నిజమని... దానిని దృష్టిలో ఉంచుకోకుండా అన్‌లాక్‌ ప్రక్రియ చేపట్టడం ఆపదలకు ఆహ్వానం పలికినట్టే అని ఆయన హెచ్చరించారు.

భారీ సంఖ్యలో ప్రజలు గుమిగూడే మైదానాలు, ప్రార్థనా స్థలాలు, క్లబ్‌లు తదితర ప్రదేశాలు కరోనా విస్తృతంగా వ్యాప్తించేందుకు కారణమౌతాయని ఆయన వివరించారు. అన్‌లాక్‌ నిర్ణయం తీసుకొనేందుకు..  స్థానిక అంశాలు, ప్రమాద అవకాశాలను పరిగణనలోకి తీసుకొని చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని ఆయన ప్రపంచ దేశాలకు సూచించారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని