భారత్‌లో కరోనా @ డిశ్చార్జిల్లో ఇదే రికార్డు!

తాజా వార్తలు

Published : 05/08/2020 16:20 IST

భారత్‌లో కరోనా @ డిశ్చార్జిల్లో ఇదే రికార్డు!

ఇంటర్నెట్‌ డెస్క్‌: దేశంలో ఓ వైపు కరోనా విజృంభణ కొనసాగుతున్నప్పటికీ..  మరోవైపు ఈ వైరస్‌ కోరల్లోంచి బయటపడుతున్న వారి సంఖ్య పెరుగుతోంది.  భారత్‌లో ఇప్పటికే కొవిడ్‌తో చికిత్సపొందుతున్నవారి కంటే కోలుకొని డిశ్చార్జి అయినవారి సంఖ్య రెట్టింపు కన్నా ఎక్కువగా ఉన్న విషయం తెలిసిందే. తాజాగా ఒక్క మంగళవారం రోజే  51,706మంది కోలుకొని డిశ్చార్జి కావడం విశేషం. ఇప్పటివరకు దేశంలో ఒక్కరోజులో కోలుకున్నవారి సంఖ్యతో పోలిస్తే ఇదే అత్యధికం. బుధవారం ఉదయం కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ విడుదల చేసిన బులిటెన్‌ ప్రకారం.. దేశంలో ఇప్పటివరకు  19,08,254 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. వీరిలో 12,82,215 మంది కరోనాను జయించి డిశ్చార్జి కాగా.. 39,795 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం 5,86,244 మంది మాత్రమే చికిత్స పొందుతున్నారు. 

దేశంలో కోలుకుంటున్నవారి సంఖ్య రోజురోజుకీ మెరుగుపడుతోంది. గత 14 రోజులతో సరిపోలిస్తే ఈ రేటు 63శాతం నుంచి 67శాతానికి పెరిగింది. ప్రస్తుతం రికవరీ రేటు 67.19%గా ఉండగా.. మరణాల రేటు 2.09%గా ఉంది. అలాగే, దేశంలో యాక్టివ్‌ కేసులు 30.72 %గా ఉన్నాయి. ఇకపోతే కరోనా టెస్ట్‌లు కూడా రోజురోజుకీ పెరుగుతున్నాయి. దేశ వ్యాప్తంగా మొత్తం 1366 ల్యాబోరేటరీల్లో కొవిడ్‌ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి.  నిన్న ఒక్కరోజే 6,19,652 శాంపిల్స్‌ పరీక్షించారు. ఇప్పటివరకు దేశ వ్యాప్తంగా 2,14,84,402 మంది నుంచి శాంపిల్స్‌ పరీక్షించినట్టు ఐసీఎంఆర్‌ వెల్లడించింది. 

దేశంలో తొలిసారి లాక్‌డౌన్‌ విధించినప్పటి నుంచి ఇప్పటివరకు రికవరీ రేటు ఇలా..

దేశంలో 19 వేలకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైన రాష్ట్రాల్లో పరిస్థితి ఇదీ..

దేశ వ్యాప్తంగా కరోనా పరిస్థితిపై ఇన్ఫోగ్రాఫ్‌


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని