2020 ఏడాది ముగింపు వేడుకలపై ఆంక్షలు

తాజా వార్తలు

Published : 30/11/2020 00:01 IST

2020 ఏడాది ముగింపు వేడుకలపై ఆంక్షలు

వెల్లడించిన దక్షిణ కొరియా

సియోల్‌: మరో నెల రోజుల్లో 2021లోకి అడుగుపెట్టబోతున్నాం. చివరి నెల డిసెంబరులో ప్రజలు అధికంగా గుమిగూడి పార్టీలు, వేడుకలు జరుపుకొంటుంటారు. కొవిడ్‌-19 మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో సంవత్సరం ముగింపు పార్టీలు, సంగీత కార్యక్రమాల్ని నిషేధిస్తున్నట్లు దక్షిణ కొరియా ప్రభుత్వం ఆదివారం ప్రకటించింది. కరోనా కొత్త దశలో కేసులు వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. కొన్ని కేఫ్‌లను, పబ్లిక్‌ ఆవిరి స్నానాల గదుల్ని కూడా మూసివేయాలని ఆదేశించారు.

ఆరంభ దశలో కరోనా వైరస్ కేసుల్ని సమర్థంగా తగ్గించిన ప్రపంచ దేశాల్లో దక్షిణ కొరియా ఒకటి. ఆసియాలోనే నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అయిన దక్షిణ కొరియాలో ఈ మధ్య కరోనా కేసుల సంఖ్య కలవరపెడుతోంది. వైరస్‌ వేగంగా వ్యాప్తి చెందుతోంది. గత మూడు రోజుల్లో 500 కంటే ఎక్కువ కేసులు నమోదు కాగా.. కేవలం ఒక్క ఆదివారం మాత్రం 450 కేసులు వెలుగులోకి వచ్చాయని దక్షిణ కొరియా వ్యాధి నియంత్రణ, నివారణ సంస్థ అధికారులు ప్రకటించారు.

పబ్లిక్‌ సమావేశాలు, జనాభా అధికంగా ఉన్న ప్రాంతాలు, దేశ రాజధాని సియోల్‌ పరిసరాల్లో కట్టుదిట్టమైన ఆంక్షలు విధించామని దక్షిణ కొరియా ప్రధాన మంత్రి తెలిపారు. ఆరోగ్య శాఖ అధికారులతో సమావేశం అనంతరం.. మంగళవారం నుంచి సామాజిక దూరంతోపాటు తదితర నిబంధనల్ని కఠినతరం చేయనున్నట్లు తెలిపారు. కరోనా సంక్షోభంలో ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్న సాధారణ ప్రజలు, వ్యాపారులకు సహాయ నిధులు విడుదల చేసే అంశంపై చర్చలు జరుగుతున్నాయని పేర్కొన్నారు.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని