రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలి

తాజా వార్తలు

Updated : 14/12/2020 23:38 IST

రైతుల ఆందోళనలకు పరిష్కారం చూపాలి

రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌

జైపుర‌: వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలపై భాజపా నేతలు కించపరిచే వ్యాఖ్యలు చేయడంపై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌ గహ్లోత్‌ మండిపడ్డారు.  రైతులను కించపరిచేలా వారు అలాంటి వ్యాఖ్యలు చేయడం చాలా దురదృష్టకరమంటూ తీవ్రంగా ఖండించారు. రైతుల డిమాండ్లపై ప్రభుత్వం త్వరగా స్పందించి పరిష్కారం చూపాలంటూ ట్విటర్‌ వేదికగా డిమాండ్‌ చేశారు. 

‘వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా నిరసనలు చేస్తున్న రైతుల పట్ల భాజపా నాయకులు కించ పరిచే వ్యాఖ్యలు చేశారు. ఇది చాలా దురదృష్టకరం. రైతుల్ని దేశ ద్రోహులతో పోల్చడానికి బదులుగా.. ప్రభుత్వం స్నేహపూర్వకంగా వ్యవహరిస్తూ డిమాండ్ల పరిష్కారం దిశగా కృషి చేయాలి. రైతులు శాంతియుతంగా నిరసనలు చేస్తున్నారు. కానీ ప్రభుత్వం వారిని పట్టించుకోకుండా వ్యవహరించడం ఆందోళన కలుగజేస్తోంది. కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలు రైతుల ప్రయోజనం చేకూర్చవు. వాటిని ప్రభుత్వం వెంటనే వెనక్కి తీసుకోవాలి’ అని గహ్లోత్‌ డిమాండ్‌ చేశారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని