‘ఇంత ఆసక్తిగా ఎన్నికలెప్పుడూ జరగలేదు’

తాజా వార్తలు

Updated : 04/11/2020 14:13 IST

‘ఇంత ఆసక్తిగా ఎన్నికలెప్పుడూ జరగలేదు’

తానా మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర

వాషింగ్టన్‌: అగ్రరాజ్యం అమెరికా రాజకీయ చరిత్రలో ఇంత ఆసక్తికరంగా ఎన్నికలు ఎప్పుడూ జరగలేదని తెలుగు అసోసియేషన్‌ ఆఫ్‌ నార్త్‌ అమెరికా (తానా) మాజీ అధ్యక్షుడు ప్రసాద్‌ తోటకూర అన్నారు. నువ్వా నేనా అన్నట్లుగా అభ్యర్థుల మధ్య పోటీ ఉందని పేర్కొన్నారు. గత 30 ఏళ్లుగా అమెరికాలో ఉంటున్న ఆయన.. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల సరళిపై ఈటీవీతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. మొదటి నుంచీ బైడెన్‌కే అవకాశాలున్నాయని సర్వే పోల్స్‌ అన్నీ చెప్పినప్పటికీ పోలింగ్‌ సమయం వచ్చేసరికి ఇద్దరి మధ్య వ్యత్యాసం తగ్గిపోయిందన్నారు. ఇప్పటికీ కౌంటింగ్‌ కొనసాగుతున్న రాష్ట్రాల్లో ఇద్దరు సాధించిన ఓట్లలో స్వల్ప తేడా ఉండటం వల్ల అధ్యక్ష పీఠం ఎవరిని వరిస్తుందనే విషయంలో ఆసక్తి నెలకొందన్నారు. అంతేకాకుండా మెయిల్‌ ఇన్‌ బ్యాలెట్ ఓట్లు కొన్ని రాష్ట్రాల్లో కీలకం కానున్నాయని.. అయితే ఇవి కచ్చితంగా ఫలితాన్ని మార్చగలవని మాత్రం చెప్పలేమన్నారు.

‘‘ఈ ఏడాది అమెరికాలోని 12 రాష్ట్రాలు (స్వింగ్‌ స్టేట్స్‌) కీలక రాష్ట్రాల జాబితాలో చేరాయి. టెక్సాస్‌ రాష్ట్రం ఇప్పటివరకు రిపబ్లికన్లకు అనుకూలమైన రాష్ట్రంగా ఉండేది. కానీ ఈ ఎన్నికల్లో సమీకరణాలు మారిపోయాయి. ఈసారి డెమొక్రాటిక్‌ పార్టీ కూడా గట్టిపోటీ ఇస్తున్న నేపథ్యంలో టెక్సాస్‌ను ఫలితాలను మార్చగల కీలక రాష్ట్రాల జాబితాలో చేర్చారు. విజయం ఖాయం అని డెమొక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌‌ ధీమాతో ఉన్నప్పటికీ ఫలితాలను మార్చగల సామర్థ్యం ఈ స్వింగ్‌ స్టేట్స్‌కు ఉంటుంది. అందువల్ల ఫలితాలు ఎలా ఉండనున్నాయో ఊహించలేం’’ అని వివరించారు.

అలాగే అమెరికా ఎన్నికల్లో ప్రవాస భారతీయుల పాత్ర.. ట్రంప్‌, జో బైడెన్‌.. ఇద్దరిలో ఎవరు గెలిచినా మొదటి ప్రాధాన్యత అమెరికా పౌరులవైపే ఉండనుందా.. బైడెన్ గెలిస్తే వీసా నిబంధనల్లో మార్పులు చేసి భారతీయులకు అనుకూలంగా వ్యవహరించగలరా.. మరిన్ని ఆసక్తికరమైన అంశాల కోసం వీడియో చూడండి..Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని