Mumbai: ఎదురెదురుగా సమీపంలోకి విమానాలు

తాజా వార్తలు

Published : 25/08/2021 13:49 IST

Mumbai: ఎదురెదురుగా సమీపంలోకి విమానాలు

జనవరి 29న ముంబయి గగనతలంలో ఘటన

దిల్లీ: ముంబయి గగనతలంలో ఈ ఏడాది జనవరి 29న రెండు విమానాలు అతి సమీపంలో ప్రమాదకరంగా ప్రయాణించాయి. అహ్మదాబాద్‌-చెన్నై ఎయిర్‌ఏసియా ఇండియా విమానం, బెంగళూరు-వడోదర ఇండిగో విమానాలు ఎదురెదురుగా.. 300 అడుగుల నిలువులో 8 కిలోమీటర్ల సమీపంలోకి వచ్చాయి. ఈనెలలో విడుదలైన ఎయిర్‌క్రాఫ్ట్‌ యాక్సిడెంట్‌ ఇన్వెస్టిగేషన్‌ బ్యూరో (ఏఏఐబీ) నివేదిక పై విషయాన్ని తెలిపింది. సాధారణంగా అహ్మదాబాద్‌ నుంచి దక్షిణాది వైపు వెళ్లే విమానాలన్నీ భావ్‌నగర్‌ మీదుగా వెళ్తుంటాయి. అయితే జనవరి 29న ఎయిర్‌ఏసియా విమానం మాత్రం ముంబై విమానాశ్రయం ల్యాండింగ్‌ మార్గంలో వెళ్లిందని నివేదిక వివరించింది. ఈ విషయాన్ని ముంబయిలోని ఎయిర్‌ట్రాఫిక్‌ కంట్రోలర్‌ గుర్తించినప్పటికీ.. సరిగ్గా స్పందించలేదని చెప్పింది. ఇలాంటి విషయాలపై కంట్రోలర్లకు మరింత శిక్షణ అవసరమని చెప్పింది. అలాగే దేశంలోని అన్ని సెక్టార్లలో ఎయిర్‌ట్రాఫిక్‌ పరిమాణాన్ని ఎయిర్‌పోర్ట్స్‌ అథారిటీ మరోసారి అంచనా వేసి, పైలట్లకు మార్గదర్శకాలు జారీ చేయాలని సూచించింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని