Corona: మళ్లీ.. రికవరీల కంటే కేసులే ఎక్కువ

తాజా వార్తలు

Updated : 15/07/2021 10:12 IST

Corona: మళ్లీ.. రికవరీల కంటే కేసులే ఎక్కువ

కొత్తగా కరోనా సోకిన వారి సంఖ్య ఎంతంటే..?

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 19,43,488 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 41,806 మందికి వైరస్ పాజిటివ్‌గా తేలింది. క్రితం రోజుతో పోల్చితే కేసుల్లో 7.7శాతం పెరుగుదల కనిపించింది. రెండురోజుల క్రితం 31వేలకు తగ్గిన కేసులు మళ్లీ పెరుగుతుండటం కలవరపెడుతోంది. నిన్న మరో 581 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దాంతో మొత్తం కేసులు 3.09 కోట్లకు చేరగా.. 4,11,989 మంది మరణించారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో నమోదవుతోన్న కేసుల్లో సగానికి పైగా కేరళ, మహారాష్ట్రలోనే వెలుగుచూస్తున్నాయి. ప్రస్తుతం కేరళలో కరోనా ఉద్ధృతి ఆందోళనకర స్థాయిలోనే ఉంది. దాంతో అక్కడ వారాంతంలో లాక్‌డౌన్ విధిస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ప్రస్తుతం కేరళలో కొత్తగా 15 వేల మందికి కరోనా సోకగా.. మహారాష్ట్రలో 8వేల మంది వైరస్ బారినపడ్డారు. 

మరోపక్క దేశవ్యాప్తంగా నిన్న 39వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. అయితే రికవరీల కంటే కొత్త కేసులే అధికంగా నమోదవడం ఆందోళన కలిగిస్తోంది. రికవరీ రేటు 97.28 శాతానికి చేరగా.. క్రియాశీల రేటు 1.39 శాతంగా కొనసాగుతోంది. ప్రస్తుతం 4,32,041 మంది కొవిడ్ బాధపడుతున్నారు. మొత్తంగా ఇప్పటివరకు 3.01కోట్ల మందికిపైగా మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇక నిన్న 34.97 లక్షల మంది టీకా వేయించుకున్నారు. ఇప్పటివరకు పంపిణీ అయిన డోసుల సంఖ్య 39 కోట్ల మార్కును దాటింది. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని