Corona: 38వేల కేసులు..43వేల రికవరీలు

తాజా వార్తలు

Updated : 17/07/2021 14:27 IST

Corona: 38వేల కేసులు..43వేల రికవరీలు

97.31 శాతానికి పెరిగిన రికవరీ రేటు..

దిల్లీ: దేశంలో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. తాజాగా 19,98,715 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. 38,079 మందికి వైరస్‌ పాజిటివ్&గా తేలింది. ముందురోజు కూడా 38వేల కేసులే నమోదయ్యాయి. తాజాగా 560 మంది మహమ్మారికి బలయ్యారు. ఇక దేశవ్యాప్తంగా ఇప్పటి వరకూ మొత్తం కేసులు 3.10కోట్లకు చేరగా.. 4,13,091 మంది ప్రాణాలు కోల్పోయారని కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. ప్రపంచ వ్యాప్తంగా మూడోవేవ్ ప్రారంభదశలో ఉందని ఇదివరకే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రానున్న 100 రోజులు అత్యంత కీలకమని కేంద్రం స్పష్టం చేసింది. కొవిడ్ నిబంధనల విషయంలో ఏ మాత్రం అలసత్వం వద్దని హెచ్చరించింది.

ఇదిలా ఉండగా.. ప్రస్తుతం 4,24,025 మంది కొవిడ్‌తో బాధపడుతున్నారు. క్రియాశీల రేటు 1.39 శాతానికి తగ్గగా.. రికవరీరేటు 97.31 శాతానికి పెరిగింది. నిన్న 43వేల మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇప్పటివరకు 3.02కోట్ల మంది వైరస్‌ను జయించారు. అలాగే నిన్న 42.12లక్షల మంది టీకా వేయించుకోగా.. మొత్తం సంఖ్య 39.96కోట్లకు చేరింది.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని