Shirdi Saibaba Temple: రేపటి నుంచి తెరుచుకోనున్న శిర్డీ ఆలయం

తాజా వార్తలు

Updated : 06/10/2021 10:54 IST

Shirdi Saibaba Temple: రేపటి నుంచి తెరుచుకోనున్న శిర్డీ ఆలయం

శిర్డీ: మహారాష్ట్రలోని శిర్డీ సాయిబాబా ఆలయం 7న తెరుచుకోనుంది. రోజుకు 15వేల మంది భక్తులను దర్శనానికి అనుమతిస్తామని సాయిబాబా దేవాలయ ట్రస్ట్‌ ప్రకటించింది. కరోనా ఉద్ధృతి కారణంగా ఈ ఏడాది ఏప్రిల్‌ 5న బాబా ఆలయాన్ని మూసివేశారు. మరోవైపు, మహారాష్ట్రలో కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో కొవిడ్‌ మార్గదర్శకాలను పాటిస్తూ.. గురువారం నుంచి భక్తులకు ఆలయ ప్రవేశం కల్పిస్తున్నట్లు ట్రస్ట్‌ సభ్యులు తెలిపారు. గర్భిణులకు, పదేళ్లలోపు చిన్నారులకు, 65 ఏళ్లు దాటిన వృద్ధులకు ఆలయ ప్రవేశం లేదని స్పష్టం చేశారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని