ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

తాజా వార్తలు

Published : 29/08/2020 10:29 IST

ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు ఉగ్రవాదుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులతో జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు ముష్కరుల్ని భద్రతా బలగాలు హతమార్చాయి. ఈ ఘటనలో ఓ జవాన్‌ సైతం అమరుడయ్యారు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. అర్ధరాత్రి ఒంటిగంట ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. పుల్వామా జిల్లాలోని జదూర ప్రాంతంలో ముష్కరులు తలదాచుకున్నారన్న పక్కా సమాచారంతో సాయుధ బలగాలతో కలిసి జమ్మూ కశ్మీర్‌ పోలీసులు నిర్బంధ తనిఖీలు నిర్వహించారు.

ఈ క్రమంలో వీరి కదలికల్ని పసిగట్టిన ఉగ్రవాదులు కాల్పులకు తెగబడడంతో ఇరు వర్గాల మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. దీంతో ముగ్గురు ముష్కరులు అక్కడికక్కడే హతమయ్యారు. ఈ క్రమంలో తీవ్రంగా గాయపడిన ఓ సైనికుడు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శనివారం ఉదయం మరణించారు. ముష్కరులు ఏ ఉగ్రవాద సంస్థకు చెందిన వారన్నది ఇంకా తెలియలేదు. ఘటనా స్థలంలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు.

ఇదీ చదవండి..

ఎదురుకాల్పుల్లో నలుగురు ఉగ్రవాదుల హతం


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని