
తాజా వార్తలు
మారడోనాపై ట్రంప్: అది నిజమైన ట్వీట్ కాదు!
న్యూయార్క్: ఫుట్‌బాల్ దిగ్గజం డీగో మారడోనా మరణంపై ఆయనకు బదులు మరొకరిని గుర్తుచేసుకుంటూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంతాపం వ్యక్తం చేశారంటూ సోషల్ మీడియాలో ఓ పోస్టు వైరల్ అయ్యింది. అయితే, అది డొనాల్డ్ ట్రంప్ చేయలేదని తేలింది. కేవలం అది తప్పుడు పోస్టుగానే నిర్ధారణ అయ్యింది.
ఫుట్‌బాల్ ఆటగాడి మరణంతో యావత్ క్రీడాలోకం మూగబోయిన విషయం తెలిసిందే. అర్జెంటీనాకు చెందిన మారడోనా గుండెపోటుతో మరణించడంతో ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆయన అభిమానులు సంతాపం ప్రకటించారు. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఆయన మరణానికి చింతిస్తూ, ట్విటర్లో రాసినట్లున్న ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యింది. దీనిలో మారడోనాను క్రీడాకారుడికి బదులు మహిళా పాప్ సింగర్ మడోన్నాగా ట్రంప్ భావించినట్లు రాసుకొచ్చారు. అయితే, ట్రంప్ అధికారిక ట్విటర్లో మారడోనాకు సంబంధించి ఎలాంటి ట్వీట్ చేయలేదు. అంతేకాకుండా ఆ వైరల్ ఫోటోను క్షుణ్ణంగా గమనిస్తే.. అది నకిలీదని స్పష్టంగా తెలుస్తోంది. కేవలం ఉద్దేశపూర్వకంగానే దీన్ని కల్పించి రాసినట్లు స్పష్టమవుతోంది. ఇక, మారడోనా మరణవార్త తెలియగానే ట్విటర్లో ఆయన పేరు ట్రెండింగ్‌గా మారింది.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
