మమ్మల్ని ఏడిపిస్తున్నారు..

తాజా వార్తలు

Published : 10/11/2020 01:56 IST

మమ్మల్ని ఏడిపిస్తున్నారు..

 ఘోరంగా విఫలమైన ట్రంప్‌ మరో ఆలోచన..

ఇంటర్నెట్‌ డెస్క్: జో బైడెన్‌ విజయానికి వ్యతిరేకంగా ఫిర్యాదులు స్వీకరించే ఉద్దేశంతో.. ఎన్నికలు జరిగిన మరుసటి రోజు డొనాల్డ్‌ ట్రంప్‌ వర్గం ‘ఓటర్‌ ఫ్రాడ్‌ హాట్‌లైన్‌’ పేరుతో ఓ అత్యవసర ఫిర్యాదుల విధానాన్ని ఏర్పాటు చేశారు. ఎన్నికల సందర్భంగా ఏవైనా అనుమానాస్పద సంఘటనలు, వ్యక్తులు తమ దృష్టిలోకి వచ్చి ఉంటే.. ఫోన్‌కాల్‌, ఆన్‌లైన్‌ విధానాల ద్వారా తమకు తెలపాలని వారు కోరారు. దీంతో ఫేక్‌ కాల్స్‌ వెల్లువెత్తాయి. పలువురు నెటిజన్లు ఆ నంబరుకు ఫోన్‌ చేసి చిత్ర విచిత్రమైన అనుభవాలను చెప్పటం మొదలుపెట్టారు. దీంతో వారికి జవాబు చెప్పలేక సంబంధిత ఉద్యోగులు బెంబేలెత్తుతున్నారు.

హాస్య నటుడు అలెక్స్‌ హిర్ష్‌ తాను ఓ వ్యక్తిని చూశానని.. అతను నల్లని టోపీ, నల్ల మాస్క్‌, చారల షర్టు, ఎర్రటి టై కట్టుకుని ఉన్నాడన్నారు. అతని సంచిలో హాంబర్గర్లు ఉండి ఉండవచ్చని.. చూసేందుకు దోపిడీదారు మాదిరిగా ఉన్నాడన్నారు. మరో హాస్యనటుడు నిక్‌ లుట్స్‌కో తనకు ఓ కవర్‌ దొరికిందని.. దానిలో ట్రంప్‌కు చెందిన లక్ష పెన్సిల్వేనియా ఓట్లు ఉన్నాయని.. అవి చాలా ముఖ్యమైనవని అన్నారు. అయితే ఈ విధమైన ఫేక్‌ కాల్స్‌కు డెమొక్రాటిక్‌ పార్టీ వర్గాలే కారణమని ట్రంప్‌ కుమారుడు ఎరిక్‌ ట్రంప్‌ ఆరోపించారు.
Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని