
తాజా వార్తలు
ట్విటర్..భారత్‌లో ఇలా తొలిసారి!
దిల్లీ: భాజపా సోషల్ మీడియా చీఫ్ అమిత్ మాలవీయ చేసిన ట్వీట్‌ను ‘వక్రీకరించిన మీడియా’ అంటూ ట్విటర్ ఫ్లాగ్ చేసింది. కాగా, భారత్‌లో ‘నకిలీ వార్త’ అంటూ ఓ ట్వీట్‌ను ట్విటర్ ఫ్లాగ్ చేయడం ఇదే మొదటిసారని కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
నూతన వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ పంజాబ్, హరియాణా, తదితర రాష్ట్రాలకు చెందిన రైతులు ఏడురోజులుగా చలో దిల్లీ ఆందోళనల్లో పాల్గొంటున్నారు. ఈ క్రమంలో భద్రతా సిబ్బంది ఒకరు రైతుపై లాఠీ ఎత్తిన చిత్రం ఆన్లైన్లో వైరల్‌గా మారింది. కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఈ చిత్రాన్ని పోస్టు చేసి, కేంద్రంపై విమర్శలు గుప్పించారు. ఈ తరుణంలో అమిత్ మాలవీయ నవంబర్ 28న ఫ్యాక్ట్ చెక్ ట్వీట్‌ను పోస్టు చేశారు. ‘వాస్తవమిది’ అంటూ ఓ వీడియోను షేర్ చేశారు. ఆ వీడియోలో పోలీసు లాఠీ ఎత్తినప్పటికీ..రైతు ఆ దెబ్బ నుంచి తప్పించుకోవడం కనిపిస్తోంది.
కాగా, ఫ్యాక్ట్ చెక్ వెబ్సైట్ ఆల్ట్ న్యూస్ ఇదే సంఘటనకు సంబంధించిన సుదీర్ఘ వీడియోను ఉంచింది. ఇందులో పోలీసులు నిరసనకారులపై లాఠీని ఝుళిపించడం కనిపిస్తోంది. మాలవీయ ఎడిట్ చేసిన వీడియోను పోస్టు చేశారంటూ విమర్శలు వెల్లువెత్తున్నాయి. అలాగే ఈ ట్వీట్ పై ట్విటర్ కూడా స్పందించింది. తమ విధానం ప్రకారం వక్రీకరించిన సమాచారం కలిగిఉన్న ట్వీట్ల ప్రామాణికతను అర్థం చేసుకోవడానికి, అదనపు సమాచారం అందించడానికి తాము లేబుల్ చేస్తామని వెల్లడించింది. మోసపూరితంగా మార్చిన, కల్పితమైన మీడియాను కలిగి ఉన్న ట్వీట్లను కూడా లేబుల్ చేస్తామని తెలిపింది. హానికలిగించే అవకాశం ఉన్నవాటిని తొలగిస్తామని పేర్కొంది. కాగా, ట్విటర్ ఈ విధంగా స్పందించడం ఇదే మొదటిసారంటూ ప్రతిపక్ష కాంగ్రెస్, ఆమ్ ఆద్మీ పార్టీలు భాజపా వైఖరిని ఎత్తి చూపుతున్నాయి.
జాతీయ-అంతర్జాతీయ
రాజకీయం
జనరల్
సినిమా
క్రైమ్
స్పోర్ట్స్
బిజినెస్
చిత్ర వార్తలు
సినిమా
- ఇన్‌కాగ్నిటో నిజంగా పనిచేస్తుందా?
- చరిత్ర సృష్టించిన నయా యార్కర్ కింగ్
- ‘నా మృతదేహాన్ని వాటికి ఆహారంగా వేయండి’
- తమన్నా చీట్: సాయేషా డ్యాన్స్: మంచు కుటుంబం
- ఫిట్‌గా ఉన్నా.. గుండెపోటు వస్తుందా?
- అరెరె షా.. రోహిత్‌కు కోపం తెప్పించేశావ్‌గా!
- ఒంటెను ఢీకొని బెంగళూరు ఫేమస్ బైకర్ మృతి
- సస్పెన్స్‌కు తెరదించిన శతాబ్ది రాయ్
- మెగా కాంపౌండ్‌లో మ్యూజికల్ నైట్
- యూట్యూబర్ తప్పుడు రివ్యూ.. మూతపడ్డ హోటల్
ఎక్కువ మంది చదివినవి (Most Read)
