అమెరికా ఎన్నికల్లో అలాంటివి 3 లక్షల ట్వీట్లు

తాజా వార్తలు

Published : 14/11/2020 20:02 IST

అమెరికా ఎన్నికల్లో అలాంటివి 3 లక్షల ట్వీట్లు

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఉత్కంఠకు తెరపడింది. డెమొక్రాటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ విజయం సాధించారు. అయితే, ఫలితాల వేళ గందరగోళం నెలకొన్న సంగతి తెలిసిందే. ఓ వైపు జో బైడెన్‌కు అనుకూలంగా ఫలితాలు వస్తుంటే.. మరోవైపు ట్రంప్‌ తాను విజయం సాధిస్తున్నా.. సాధించా అంటూ ట్వీట్లు పెట్టారు. ఇలా చేయడం వివాదాస్పదమైంది. ఇలాంటి తప్పుడు సమాచారంపై ముందుగానే ఓ కన్నేసి ఉంచిన ట్విటర్‌.. ఆయన చేసిన ట్వీట్లను లేబుల్‌ చేసింది. ఈ సమాచారం తప్పుదోవ పట్టించేలా ఉందని అందులో పేర్కొంది. 

అయితే, కేవలం ట్రంప్‌వే కాదు.. అమెరికా అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో దాదాపు 3 లక్షల ట్వీట్లకు ఈ విధంగా లేబుల్‌  వినియోగించినట్లు ట్విటర్‌ తాజాగా పేర్కొంది. అమెరికా ఎన్నికలకు సంబంధించి చేసిన మొత్తం ట్వీట్లలో వీటి వాటా 0.2 శాతమని తెలిపింది. నవంబర్‌ 3న ఎన్నికలు జరగ్గా.. అక్టోబర్‌ 27 నుంచి నవంబర్‌ 11 వరకు ట్విటర్‌ ఈ లేబుల్‌ను వినియోగించింది. ఇలా లేబుల్‌ వినియోగించిన వాటిలో ట్రంప్‌ ట్వీట్లే 50 వరకు ఉండడం గమనార్హం.

ఇదీ చదవండి..

ట్రంప్‌ ‘సామాజిక’ కయ్యాలు.. దీటుగా స్పందించిన ట్విటర్‌


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని