కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు ముష్కరుల హతం
close

తాజా వార్తలు

Published : 28/10/2020 09:26 IST

కశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ ఇద్దరు ముష్కరుల హతం

శ్రీనగర్‌: జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ముష్కరులు హతమయ్యారు. పోలీసుల వివరాల ప్రకారం.. బుద్గాం జిల్లా చదూర ప్రాంతంలోని మోచ్వా గ్రామంలో ఉగ్రవాదులు నక్కి ఉన్నారని మంగళవారం సాయంత్రం పోలీసులకు సమాచారం అందింది. దీంతో వెంటనే సాయుధ బలగాలతో కలిసి వారు ఏడు గంటల సమయంలో నిర్బంధ తనిఖీలు ప్రారంభించారు. ఈ క్రమంలో దళాల కదలికల్ని పసిగట్టిన ముష్కరులు కాల్పులకు తెగబడ్డారు. వెంటనే స్పందించిన భద్రతా బలగాలు ఎదురుకాల్పులు ప్రారంభించాయి. దీంతో ఇద్దరు ముష్కరులు అక్కడికక్కడే మృతిచెందారు. వీరు ఏ ఉగ్రసంస్థకు చెందినవారన్నది ఇంకా తెలియాల్సి ఉంది. రాత్రి 9 గంటలకు ప్రారంభమైన ఎన్‌కౌంటర్‌ దాదాపు 5 గంటల పాటు కొనసాగింది.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని