అలస్కాలో విమాన ప్రమాదం..ఏడుగురి మృతి

తాజా వార్తలు

Published : 01/08/2020 20:39 IST

అలస్కాలో విమాన ప్రమాదం..ఏడుగురి మృతి

అలస్కా: అమెరికాలోని అలస్కాలో ఘోర ప్రమాదం జరిగింది. రెండు విమానాలు ఢీకొన్న ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. అలాస్కాకు సమీపంలోని కెనాయ్‌ ద్వీపకల్పంలో ఉన్న సోల్డోట్నా నగర విమానాశ్రయం వద్ద ఈ ప్రమాదం సంభవించినట్లు అధికారులు తెలిపారు. అలస్కా ప్రాంతానికి ప్రాతినిధ్యం వహిస్తున్న రిపబ్లికన్‌ సభ్యుడు గ్యారీ నాప్‌ కూడా ఈ ప్రమాదంలో మృతి చెందారు. ఆయన ఒక్కడే ఓ విమానంలో ప్రయాణిస్తున్నారు. మరో విమానంలో దక్షిణ కరోలినా నుంచి నలుగురు పర్యాటకులు, కన్సాస్‌ నుంచి ఒక పర్యాటక గైడ్‌తో పాటు సోల్డోట్నాకు చెందిన పైలట్‌ అందులో ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఈ ప్రమాదంపై ఎఫ్‌ఏఏ, జాతీయా రవాణా భద్రతా బోర్డు దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొంది. గ్యారీ నాప్‌(67) రిపబ్లికన్ పార్టీ తరఫున స్టేట్‌ హౌజ్‌లో సభ్యుడిగా కొనసాగుతున్నారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని