close

తాజా వార్తలు

Published : 09/08/2020 00:25 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share

ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేం: హర్దీప్‌సింగ్

దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచిఉండాలని కేంద్రమంత్రి వెల్లడి

తిరువనంతపురం: కొలికోడ్‌ ఘటనను మంగళూరు ఘటనతో పోలుస్తూ అప్పుడే ఓ నిర్ణయానికి రాలేమని కేంద్ర విమానయాన శాఖ మంత్రి హర్దీప్‌సింగ్‌ పూరి అన్నారు. శనివారం  ఓ విలేకరుల సమావేశంలో మంత్రి మాట్లాడారు. ప్రమాదానికి సంబంధించి దర్యాప్తు పూర్తకాకముందే ఓ నిర్ణయానికి రాలేమని పేర్కొన్నారు. ‘లేబుల్‌ టాప్‌ చాలా ప్రాంతాల్లో ఉంది. దాని వల్ల కొన్ని సమస్యలు ఉన్నాయన్నది వాస్తవం. కానీ ఈ ఘటనను పదేళ్ల క్రితం జరిగిన మంగళూరు ఘటనతో పోలుస్తూ ఇప్పుడే ఓ నిర్ణయానికి రాలేము. దర్యాప్తు పూర్తయ్యే వరకు వేచిచూడాలి’ అని ప్రమాదం జరిగిన  ప్రాంతాన్ని పరిశీలించిన అనంతరం విలేకరుల సమావేశంలో పూరి మాట్లాడారు.

ఈ దుర్ఘటనపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పనిచేస్తున్నాయని మంత్రి అన్నారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం అందించనున్నట్లు ఆయన ప్రకటించారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందిస్తున్నట్లు ప్రకటించారు. ఈ ప్రమాదంలో మృతిచెందిన పైలట్ కెప్టెన్ దీపక్ సాథేను, కో-పైలట్ అఖిలేష్ కుమార్‌లకు నివాళులర్పించారు. సాథే ఎంతో నైపుణ్యం గల పైలట్‌ అని కొనియాడారు. 


Tags :

జాతీయ-అంతర్జాతీయ

రాజకీయం

జనరల్‌

సినిమా

క్రైమ్

స్పోర్ట్స్

బిజినెస్‌

జిల్లా వార్తలు
మరిన్ని

దేవతార్చన

+

© 1999- 2020 Ushodaya Enterprises Pvt.Ltd,All rights reserved.
Powered By Margadarsi Computers

Android PhonesApple Phones

For Editorial Feedback - eMail: infonet@eenadu.net
For Digital Marketing enquiries Contact :
040 - 23318181 eMail :marketing@eenadu.net
Best Viewed In Latest Browsers

Terms & Conditions   |   Privacy Policy

Contents of eenadu.net are copyright protected.Copy and/or reproduction and/or re-use of contents or any part thereof, without consent of UEPL is illegal.Such persons will be prosecuted.