ఆ నిధులు ఎటుపోతున్నాయ్‌? : మమత

తాజా వార్తలు

Published : 02/12/2020 01:44 IST

ఆ నిధులు ఎటుపోతున్నాయ్‌? : మమత

కోల్‌కతా: కేంద్రం దర్యాప్తు సంస్థలతో తమను భయపెట్టాలని చూస్తోందని పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ ఆరోపించారు. అత్యవసర సమయంలో ప్రజల్ని ఆదుకోవడానికి కేటాయించిన పీఎం కేర్స్‌ నిధులు ఎక్కడ వెళ్తున్నాయని ఆమె ప్రశ్నించారు. ఈ మేరకు ఆమె మంగళవారం మంత్రి మండలి సమావేశం అనంతరం మీడియాతో వెల్లడించారు. ‘పీఎం కేర్స్‌కు కేటాయించిన లక్షల కోట్ల నగదు ఎక్కడ పోతోంది? ఆ నిధుల గురించి భవిష్యత్తు ఎవరికైనా తెలుసా? కేంద్రం మాకు మాత్రం పాఠాలు చెబుతుంది. కానీ వారు ఎందుకు ఆ నగదుపై ఆడిట్‌ నిర్వహించడం లేదు. కరోనా వైరస్‌తో పోరాటం చేయడానికి కేంద్రం మాకు ఏవిధంగా సాయపడిందో చెప్పాలి’ అని మమతా కేంద్రంపై నిప్పులు చెరిగారు.

దేశంలో ఇతర రాష్ట్రాలతో పోలిస్తే పశ్చిమబెంగాల్‌లో శాంతి భద్రతలు ఎంతో బాగున్నాయన్నారు. మమ్మల్ని భయపెట్టడానికి కేంద్రం దర్యాప్తు సంస్థలను ఉపయోగించుకుంటోందని ఆరోపిస్తూ.. ఏం చేసినా తాము వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు. వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న నిరసనల విషయంలో భాజపాకు ఏ పార్టీ మద్దతు ఇవ్వడం లేదని.. రైతుల విషయంలో భాజపా మొండి వైఖరి అవలంబించడం సరికాదని మమత విమర్శలు చేశారు. కాగా పశ్చిమబెంగాల్‌ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఏప్రిల్‌, మే నెలల్లో ఎన్నికలు నిర్వహించనున్న విషయం తెలిసిందే. బెంగాల్‌ శాసనసభలో మొత్తం 294 స్థానాలు ఉన్నాయి. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని