రెండు నెలల్లో.. 1470 కిలోమీటర్లు

తాజా వార్తలు

Published : 05/06/2021 17:48 IST

రెండు నెలల్లో.. 1470 కిలోమీటర్లు

73.5 శాతం వేగంగా జాతీయ రహదారుల నిర్మాణ పనులు 
వెల్లడించిన రోడ్డు రవాణ, రహదారుల మంత్రిత్వ శాఖ  

 

దిల్లీ: దేశంలో మౌలిక వసతుల కల్పనపై కేంద్రం దృష్టి సారించింది. అందులో భాగంగా కొన్నేళ్లుగా జాతీయ రహదారుల నిర్మాణం వేగం పుంజుకుంది. 2021-22 ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లోనే సుమారు 1470 కిలోమీటర్ల పొడవున జాతీయ రహదారుల నిర్మాణం జరిగినట్లు రోడ్డు రవాణ, జాతీయ రహదారుల మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. గతేడాది ఏప్రిల్‌-మే నెలల్లో 847 కిలోమీటర్ల మేర రహదారుల నిర్మాణం చేపట్టగా, ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి రెండు నెలల్లో 73.5 శాతం వేగంగా నిర్మాణ పనులు జరిగాయని ట్వీట్‌ చేసింది. వచ్చే రెండేళ్లలో రహదారుల నిర్మాణంపై  రూ.15 లక్షల కోట్లు ఖర్చు పెట్టాలనేదే కేంద్ర ప్రభుత్వం లక్ష్యమని రవాణా శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ అంతకుముందు వివరించారు. ఈ ఆర్థిక సంవత్సరంలో రోజుకు 40 కిలోమీటర్ల మేర జాతీయ రహదారుల నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించుకున్నట్లు ఆయన స్పష్టం చేశారు. 

భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ(ఎన్‌హెచ్‌ఏఐ) ఈ ఏడాది ఫిబ్రవరిలో ప్రపంచ రికార్డు సృష్టించింది. విజయ్‌పుర్‌-షోలాపుర్‌ మధ్య నాలుగు వరుసల జాతీయ రహదారి నిర్మాణంలో భాగంగా కేవలం 18 గంటల్లోనే 25.54 కిలోమీటర్ల పొడవున్న ఒక వరుస రోడ్డును నిర్మించి ఈ ఘనత సాధించింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని