ఏరో ఇండియా: అవకాశాలకు రన్‌వే

తాజా వార్తలు

Published : 29/01/2021 23:00 IST

ఏరో ఇండియా: అవకాశాలకు రన్‌వే

కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌

దిల్లీ: 2021లో జరిగే ఏరో ఇండియా కార్యక్రమం అనేక అవకాశాలకు రహదారి అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ శుక్రవారం పేర్కొన్నారు. ఈ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 3 నుంచి ఫిబ్రవరి 5 వరకూ నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు ఆయన ట్విటర్‌లో ఏరోఇండియా కార్యక్రమానికి సంబంధించిన ఒక వీడియోను షేర్‌ చేశారు. ‘‘ ఏరో ఇండియా కార్యక్రమం ఫిబ్రవరి3-5 తేదీల్లో బెంగళూరులో జరగనుంది. ఇది చాలా వినూత్నమైన కార్యక్రమం. ఇది బిలియన్‌ అవకాశాలకు రన్‌వే.’’ అని ఆయన ఆ ట్వీట్‌లో పేర్కొన్నారు.

ది ఏరో ఇండియా అనే ఈ కార్యక్రమంలో వివిధ ఏరోస్పేస్‌ కంపెనీలు వాటి ఉత్పత్తులను ప్రదర్శిస్తాయి. ఈ కార్యక్రమం బెంగళూరులోని యెలహంక ఎయిర్‌ఫోర్స్‌ స్టేషన్‌లో జరగనుంది. కరోనా కారణంగా ఈ కార్యక్రమంలో పాల్గొనే ప్రతినిధులు వారి ఉత్పత్తులను వర్చువల్‌గానూ ప్రదర్శించే అవకాశాన్ని కల్పించారు. ఇందులో పాల్గొనేవారు తప్పనిసరిగా కరోనా నెగెటివ్‌ రిపోర్టును సమర్పించాలని నిర్వాహకులు వెల్లడించారు. ప్రారంభోత్సవం రోజున 41 ఎయిర్‌ క్రాఫ్ట్‌లు ప్రదర్శించనున్నట్లు వారు తెలిపారు. మరో 63 ఎయిర్‌క్రాఫ్ట్‌లు డిస్‌ప్లేలో ఉంటాయన్నారు. వీటిల్లో సూర్యకిరణ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌, సారంగ్‌ హెలికాఫ్టర్లు ప్రధానాకర్షణగా నిలుస్తాయని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌ లిమిటెడ్‌ ‘ఆత్మనిర్భర్‌ ఫార్మేషన్‌ విమానాన్ని’ ప్రదర్శించనున్నట్లు వారు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. అంతేకాకుండా సుఖోయ్‌, అడ్వాన్డ్స్‌ లైట్‌ హెలికాఫ్టర్‌ ధ్రువ్‌ వంటి చాలా విమానాలను ప్రదర్శనలో ఉంచనున్నట్లు వారు ఆ ప్రకటనలో వెల్లడించారు.

ఇవీ చదవండి..

సింఘులో మళ్లీ ఉద్రిక్తత

మాస్క్‌పై మాస్క్‌ ప్రయోజనమెక్కువ: ఫౌచీAdvertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని