Afghanistan: పాక్‌ పారిపోయిన అఫ్గాన్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్టు

తాజా వార్తలు

Updated : 15/09/2021 18:27 IST

Afghanistan: పాక్‌ పారిపోయిన అఫ్గాన్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్టు

(పాత చిత్రం)

ఇస్లామాబాద్‌: అఫ్గానిస్థాన్‌లో తాలిబన్ల రాజ్యం వచ్చిన తర్వాత అక్కడి మహిళల హక్కులు హరించుకుపోతున్నాయి. అమ్మాయిలకు ఆటలు అవసరం లేదని తాలిబన్లు ప్రకటించడంతో ఆ దేశంలోని మహిళా క్రీడాకారుల భవిష్యత్తు అగమ్యగోచరంగా మారింది. ఇప్పటికే అఫ్గాన్‌ మహిళా ఫుట్‌బాల్‌ జట్టుకు తాలిబన్ల నుంచి బెదిరింపులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో ఆ జట్టు దేశం నుంచి పారిపోయింది. సరిహద్దును దాటుకుని పాకిస్థాన్‌ చేరుకుంది. 

అఫ్గాన్‌ జాతీయ మహిళల జూనియర్‌ ఫుట్‌బాల్‌ జట్టుకు చెందిన 32 మంది క్రీడాకారిణులు, వారి కోచ్‌లు, కుటుంబసభ్యులు మంగళవారం సరిహద్దు దాటి పాకిస్థాన్‌లోని పెషావర్‌ చేరుకున్నట్లు పాక్‌ మీడియా సంస్థ డాన్‌ కథనం వెల్లడించింది. నిజానికి వీరంతా కాబుల్‌ నుంచి ఖతర్‌ వెళ్లాల్సి ఉంది. అయితే గత నెల 26న కాబుల్‌ ఎయిర్‌పోర్టులో జరిగిన ఉగ్రదాడి తర్వాత ఆ విమానశ్రయం నుంచి రాకపోకలు నిలిచిపోయిన విషయం తెలిసిందే. దీంతో వీరంతా అక్కడే ఉండిపోయారు. బ్రిటిష్‌కు చెందిన ఫుట్‌బాల్‌ ఫర్‌ పీస్‌ ఇన్‌ కో ఆపరేషన్‌ అనే ఎన్జీవో సంస్థ వీరి గురిచి తెలుసుకుని పాకిస్థాన్‌ ప్రభుత్వం, పాక్‌ ఫుట్‌బాల్‌ ఫెడరేషన్‌తో చర్చలు జరిపింది. వీరి సాయంతోనే ఈ జట్టు పాకిస్థాన్‌ చేరుకోగలిగింది.

నెలక్రితం తాలిబన్లు అఫ్గానిస్థాన్‌ను హస్తగతం చేసుకోగానే.. మహిళా ఫుట్‌బాల్‌ క్రీడాకారులు సహా అనేక మంది క్రీడాకారిణులు రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. వారి గురించి తెలియకూడదని కొందరు అమ్మాయిలు ఫుట్‌బాల్‌ కిట్లు, జెర్సీలను తగలబెట్టినట్లు అప్పట్లో వార్తలు కూడా వచ్చాయి.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని