Covid: దిల్లీలో పదివేల దిగువకు యాక్టివ్‌ కేసులు

తాజా వార్తలు

Published : 02/06/2021 19:39 IST

Covid: దిల్లీలో పదివేల దిగువకు యాక్టివ్‌ కేసులు

దిల్లీ: కరోనా రెండో దశ విజృంభణతో అతలాకుతలమైన దేశ రాజధాని దిల్లీలో పరిస్థితులు మెరుగవుతున్నాయి. యాక్టివ్‌ కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత మార్చి 31 నుంచి మొదటిసారి యాక్టివ్‌ కేసుల సంఖ్య పదివేల దిగువకు చేరింది. దిల్లీలో ప్రస్తుతం 9,364 యాక్టివ్‌ కేసులు మాత్రమే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 576 కేసులే నమోదయ్యాయి. కానీ మరణాలు మాత్రం భారీగానే సంభవిస్తున్నాయి. 24 గంటల్లో 103 మంది మృతిచెందారు. వరుసగా మూడో రోజూ పాజిటివిటీ రేటు ఒక శాతానికి దిగువనే నమోదైంది. బుధవారం పాజిటివిటీ రేటు 0.78 శాతంగా ఉంది. 

కరోనా కట్టడి నిమిత్తం ఆంక్షల చట్రంలో చిక్కుకుపోయిన దిల్లీలో మే 31 నుంచి దశలవారీగా అన్‌లాకింగ్ ప్రక్రియ ప్రారంభించారు. నెలరోజులకు పైగా విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు ఫలితాన్నిచ్చాయి. దాంతో అక్కడ కొత్త కేసులు తగ్గుముఖం పట్టాయి. ఒక దశలో 36 శాతానికి చేరిన పాజిటివిటీ రేటు తాజాగా 0.78 శాతానికి పడిపోయింది. 


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని