covid19: ఆర్మీ కీలక నిర్ణయం..!

తాజా వార్తలు

Published : 03/05/2021 01:12 IST

covid19: ఆర్మీ కీలక నిర్ణయం..!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సైన్యంలోని ఆర్మడ్‌ఫోర్స్‌ మెడికల్‌ సర్వీసెస్‌లో పనిచేస్తున్న దాదాపు 200మంది షార్ట్‌ సర్వీస్‌ కమిషన్‌ సిబ్బందికి ఎక్స్‌టెన్షన్‌ ఇచ్చారు. ఈ పొడిగింపు డిసెంబర్‌ 31వరకు వర్తించనుంది. వీరంతా వాస్తవానికి రానున్న ఏడు నెలల్లో పదవీ విరమణ చేయాల్సి ఉంది. ఈ విషయాన్ని డిప్యూటీ చీఫ్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్‌ మెడికల్‌ స్టాఫ్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ డాక్టర్‌ మాధురి కనిత్కర్‌ వెల్లడించారు. ఆమె చీఫ్‌ ఆఫ్‌ డిఫెన్స్‌ స్టాఫ్‌ కింద వైద్యవిభాగంలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం కొవిడ్‌ పరిస్థితుల దృష్ట్యా వీరి సేవలు వినియోగించుకోనున్నట్లు వెల్లడించారు.

‘‘వీరంతా వెళ్లిపోవాల్సి ఉంది. కానీ, మేం కొనసాగిస్తున్నాం. మన దేశంలో ప్రాథమిక వైద్యవ్యవస్థలో సౌకర్యాలను మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. మంచి వైద్య సదుపాయాలు ఉన్న దేశాలే కొవిడ్‌ దెబ్బకు కుంగిపోయాయి. వాటితో పోలిస్తే మనం మెరుగ్గా పనిచేస్తున్నట్లే లెక్క’’ అని కనిత్కర్‌ పీటీఐకు వెల్లడించారు. ఈ ఆదేశాలకు సంబంధించిన ప్రతిపాదనలు అడ్వాన్స్‌ స్టేజీల్లో ఉన్నాయి.


Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని