పాంగాంగ్‌ సరస్సులోకి కొత్త పడవలు..!

తాజా వార్తలు

Updated : 13/06/2021 11:56 IST

పాంగాంగ్‌ సరస్సులోకి కొత్త పడవలు..!

ఇంటర్నెట్‌డెస్క్: చైనాతో సరిహద్దు వివాదం నేపథ్యంలో భారత్‌ అప్రమత్తమైంది. అత్యవసర పరిస్థితుల్లో లద్దాఖ్‌లోని పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల తరలింపు వేగవంతంగా జరిగేలా చర్యలు తీసుకుంటోంది. దీనిలో భాగంగా దాదాపు 17 మర పడవల కొనుగోలుకు రంగం సిద్ధం చేసింది. దీనికి సంబంధించిన ఆర్డర్‌ను కూడా గోవాలోని ఒక నౌకల తయారీ కంపెనీకి ఇచ్చినట్లు సమాచారం.  ఈ ఏడాది మార్చిలో పాంగాంగ్‌ సరస్సు వద్ద బలగాల ఉపసంహరణపై ఇరు దేశాల మధ్య ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఇందుకోసం పలు దఫాలుగా ఇరు దేశాల కోర్‌ కమాండర్లు భేటీ అయ్యారు. ఇక గోగ్రాపోస్ట్‌, హాట్‌ స్ప్రింగ్స్‌ వద్ద మాత్రం ఇప్పటి వరకు ఎటువంటి పురోగతి లేదు.

గోవాకు చెందిన ఆక్వారియుస్‌ షిప్‌యార్డ్‌కు ఈ ఆర్డర్‌ దక్కినట్లు తెలుస్తోంది. ఈ సంస్థ వేగంగా నడిచే బోట్లను తయారు చేస్తుంటుంది. భారత నావికదళ కమాండర్‌ అభిలాష్ టామీ ఫ్రాన్స్‌లోని గోల్డెన్‌ గ్లోబ్‌ రేసులో పాల్గొనేందుకు అవసరమైన బోట్‌ను ఈ కంపెనీ చేసింది. ఇటువంటి బోట్లను నావికాదళం కూడా వినియోగిస్తోంది. 35 అడుగుల పొడవు ఉండే ఈ బోటు 20-22 మందిని తరలించగలదు. గంటకు 20నాట్ల స్పీడు(37 కిలోమీటర్ల)తో ఇది ప్రయాణిస్తుంది. అవసరమైతే దీనికి తేలిక పాటి ఆయుధాలను కూడా అమర్చవచ్చు. దీనిని పూర్తిగా ఫైబర్‌ గ్లాస్‌తో తయారు చేస్తారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని