Viral video: గాల్లో పిజ్జాని ఎలా తింటున్నారో చూశారా?

తాజా వార్తలు

Updated : 30/08/2021 15:45 IST

Viral video: గాల్లో పిజ్జాని ఎలా తింటున్నారో చూశారా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: అంతరిక్షంలో ప్రయాణించేటప్పుడు ఉండే కిక్కే వేరంటారు వ్యోమగాములు. ఇక స్పేస్‌లో ఉండేటప్పుడు.. వారికి నచ్చే ఆహారానికి దూరంగా ఉండాల్సి వస్తుంది. కానీ ఈ వ్యోమగాములు అలా చేయలేదు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం(ఐఎస్‌ఎస్‌)లో గాల్లో పిజ్జా తింటూ.. ఆ క్షణాలను ఆస్వాదించారు. ఇందుకు సంబంధించిన వీడియోను ఆస్ట్రోనాట్‌ థామస్‌ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ఇందులో ఆరుగురు వ్యోమగాములు ‘‘ఫ్లోటింగ్‌ పిజ్జా పార్టీ’’ చేసుకున్నారు. నిమిషం నిడివి ఉన్న ఈ వీడియోలో గాల్లో  పిజ్జా తయారు చేసుకుంటూ కనిపించారు. ‘‘ ఈరోజు మాకు స్నేహితులతో పిజ్జా నైట్‌.. అంతరిక్షంలో ఉన్నా సరే.. భూమి మీద శనివారం వస్తే ఎలా ఉంటామో అలానే సందడి చేస్తున్నాం. మంచి చెఫ్‌ తన వంటల సీక్రెట్స్‌ గురించి చెప్పరంటారు. కానీ నేను అలా కాకుండా వీడియో తీసి మీతో పంచుకుంటున్నా. ఈ పిజ్జా తయారీ మొత్తంలో ఒక్క పైనాపిల్‌కు మాత్రం మినహాయింపు ఇవ్వండి. ఎందుకంటే ఇటలీలో పిజ్జా తయారీలో పైనాపిల్‌ నిషేధం’’ అంటూ రాసుకొచ్చారు.



Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని