60 ఏళ్లలో అత్యధికం.. నీట మునిగిన సిడ్నీ

తాజా వార్తలు

Published : 23/03/2021 01:18 IST

60 ఏళ్లలో అత్యధికం.. నీట మునిగిన సిడ్నీ

సిడ్నీ: ఆస్ట్రేలియాలో భారీ వర్షాలకు వరదలు పోటెత్తుతున్నాయి. సిడ్నీ నగరం నీట మునిగింది. ఇళ్లు, కార్యాలయాలు, షాపింగ్‌ మాల్స్‌లోకి వరద నీరు చేరింది. నిత్యావసరాలు లభించక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. వందలాది మంది ముంపు బాధితులను పునరావాస కేంద్రాలకు తరలించినట్లు అధికారులు వెల్లడించారు. గడిచిన 60 ఏళ్లలో ఇదే అత్యధిక వర్షపాతమని పేర్కొన్నారు. సిడ్నీలో సుమారు 54వేల మందిపై వరద ప్రభావం పడినట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం పేర్కొంది. వరదల్లో చిక్కుకున్న జంతువులను రక్షించేందుకు సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. వరదల ధాటికి జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. సిడ్నీ సహా పలు నగరాల్లో పరిస్థితి దారుణంగా ఉందని ఆ దేశ వ్యవసాయ శాఖ మంత్రి డేవిడ్‌ లిటిల్‌ ప్రౌడ్‌ వెల్లడించారు. రాబోయే రెండు రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రమయ్యే ప్రమాదం ఉందని, ప్రజలు జాగ్రత్తలు పాటించాలని సూచించారు. Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని