ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీ.. రాసేదెవరంటే?

తాజా వార్తలు

Updated : 05/08/2021 23:23 IST

ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీ.. రాసేదెవరంటే?

ఇంటర్నెట్‌ డెస్క్‌: టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ వ్యవస్థాపకుడు ఎలాన్‌ మస్క్‌ బయోగ్రఫీ రానుంది.  ఆపిల్‌ సంస్థ సహ వ్యవస్థాపకుడు, సీఈవో స్టీవ్‌ జాబ్స్‌ జీవిత చరిత్ర రాసిన అమెరికన్‌ రచయిత వాల్టర్‌ ఐజాక్‌సన్‌ దీన్ని రాయనున్నారు.  ఈ విషయాన్ని మస్క్‌ ధ్రువీకరిస్తూ.. ‘మీరు టెస్లా, స్పేస్‌ ఎక్స్‌తోపాటు నా జీవితంలోని ఆయా విషయాలపై ఆసక్తిగా ఉన్నారా? అయితే వాల్టర్‌ ఐజాక్‌సన్‌ నా బయోగ్రఫీ రాయనున్నార’ని ట్వీట్‌ చేశారు. ఐజాక్‌సన్‌ గతంలో బెంజమిన్‌ ఫ్రాంక్లిన్‌, ఆల్బర్ట్‌ ఐన్‌స్టీన్‌పై పుస్తకాలు రాశారు. తర్వాత అవి టీవీ సీరిసులుగానూ రావడం విశేషం.  

‘ఈ తరం స్టీవ్‌ జాబ్స్‌ ఆయన’ 

రచయిత ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మస్క్‌ను ఈ తరం ‘స్టీవ్‌ జాబ్స్‌’గా పోల్చారు. ప్రపంచాన్ని మార్చగలనని ఆలోచించేంత పిచ్చి ఆయనకు ఉంది. బహుశా వారిలో ఒకడు కావచ్చు కూడా అని అన్నారు. ఇదిలా ఉండగా.. ఇది మస్క్‌ రెండో బయోగ్రఫీ. 2015లోనూ యాష్లీ వాన్స్‌ ‘ఎలన్‌ మస్క్‌: టెస్లా, స్పేస్‌ ఎక్స్‌ అండ్‌ ది క్వెస్ట్‌ ఫర్‌ ఏ ఫెంటాస్టిక్‌ ఫ్యూచర్‌’పేరిట రాశారు.  తాజాగా రెండోది ప్రకటించారు. ఎలాన్‌ ట్వీట్‌పై ఓ నెటిజన్‌  స్పందిస్తూ..‘మీరు సొంతంగా రాయడం లేదా’ అని ప్రశ్నించగా.. ఏదో ఒక రోజు రాస్తానని బదులిచ్చారు.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని