అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

తాజా వార్తలు

Updated : 28/05/2021 21:29 IST

అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు

దిల్లీ: దేశంలో మరోసారి కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధాన్ని మరోసారి పొడిగించింది. ప్రస్తుతం కొనసాగుతున్న ఈ నిషేధాన్ని జూన్‌ 30 వరకు పొడిగిస్తున్నట్లు వెల్లడించింది. ఈ మేరకు డీజీసీఏ డైరెక్టరేట్‌ జనరల్‌ ఓ ప్రకటన విడుదల చేసింది. అయితే కార్గో సర్వీసులకు ఇది వర్తించదని తెలిపింది. ఇప్పటికే డీజీసీఏ ఎంపిక చేసిన దేశాలకు మాత్రం విమానాలు నడుస్తాయని స్పష్టం చేసింది.

భారత్‌లో కొవిడ్‌ విజృంభిస్తుండటంతో 2020 మార్చి 23 నుంచి షెడ్యూల్డ్ అంతర్జాతీయ ప్రయాణ సేవలు నిలిపివేశారు. వందే భారత్ మిషన్ కింద ప్రత్యేక అంతర్జాతీయ విమాన సేవలు మే నుంచి మొదలయ్యాయి. అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్, ఫ్రాన్స్‌తో సహా 27 దేశాలతో భారత్.. ఎయిర్ బబుల్ ద్వారా రాకపోకలను కొనసాగిస్తోంది. అయితే దేశంలో కరోనా రెండో దశ కారణంగా కేసులు విపరీతంగా పెరిగిపోవడంతో చాలా దేశాలు భారత్‌ నుంచి విమానాలను తాత్కాలికంగా నిషేధించాయి.Advertisement

Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని