బెంగాల్‌లో పాక్షిక Lockdown 

తాజా వార్తలు

Published : 30/04/2021 20:39 IST

బెంగాల్‌లో పాక్షిక Lockdown 

కోల్‌కతా: కరోనా కేసులు భారీగా పెరుగుతున్న వేళ రాష్ట్రంలో పాక్షిక లాక్‌డౌన్‌ విధిస్తున్నట్టు బెంగాల్‌ ప్రభుత్వం వెల్లడించింది. షాపింగ్‌ కాంప్లెక్స్‌లు, బ్యూటీ పార్లర్లు, సినిమా థియేటర్లు, క్రీడా సంబంధిత ప్రదేశాలు, స్పాలు మూసివేస్తున్నట్టు తెలిపింది. మార్కెట్లు 5 గంటల పాటు (ఉదయం 7 నుంచి 10గంటల వరకు; మధ్యాహ్నం 3గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు) మాత్రమే తెరిచి ఉంచాలని నిర్ణయించింది. రెస్టారెంట్లు, బార్‌లు, జిమ్‌లు, స్విమ్మింగ్‌ పూల్స్‌ను మూసివేయాలని ఆదేశించింది. హోం డెలివరీ, ఆన్‌లైన్‌ సేవలను అనుమతించింది. ఈ ఆదేశాలు తక్షణమే అమలులోకి వస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. తదుపరి ఆదేశాలు జారీచేసే వరకూ ఈ ఆంక్షలు అమలులో ఉంటాయని స్పష్టంచేసింది.

అన్ని సామాజిక, సాంస్కృతిక, వినోద, విద్యా సంబంధమైన సమావేశాలను నిషేధించింది. ఔషధ దుకాణాలు, వైద్య సంబంధిత పరికరాలు, నిత్యావసర సరకుల విక్రయాలకు ఈ పాక్షిక లాక్‌డౌన్‌ నుంచి మినహాయింపు ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు మే 2న వెల్లడి కానున్నందున.. కౌంటింగ్ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు పాటించాలని ఆదేశించింది. రాష్ట్రంలో రోజువారీ కేసులు భారీగా పెరుగుతున్నాయి. గురువారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 17,403 కొత్త కేసులు, 89 మరణాలు నమోదయ్యాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని