ఫలితాల అనంతరం బైడెన్‌ తొలి ట్వీట్‌

తాజా వార్తలు

Updated : 08/11/2020 04:54 IST

ఫలితాల అనంతరం బైడెన్‌ తొలి ట్వీట్‌

వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం అనంతరం డెమొక్రటిక్‌ అభ్యర్థి జో బైడెన్‌ తొలి ట్వీట్‌ చేశారు. అమెరికా వంటి గొప్ప దేశానికి నాయకత్వం వహించడానికి తనను ఎన్నుకోవడాన్ని గౌరవంగా భావిస్తున్నానన్నారు. తనకు ఓటేసినా లేకపోయినా అమెరికన్లందరికీ తాను అధ్యక్షుడిగా ఉంటానని హామీ ఇచ్చారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ట్వీట్‌లో పేర్కొన్నారు. అలాగే, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన కాసేపటికే బైడెన్‌ అమెరికా అధ్యక్షుడిగా, కమలా హారిస్‌ ఉపాధ్యక్షురాలిగా ఎన్నికైనట్లు వారి ట్విటర్‌ ప్రొఫైల్‌ మారడం గమనార్హం.Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని