Face to Face: బైడెన్‌, పుతిన్‌ భేటీ!

తాజా వార్తలు

Published : 16/06/2021 18:33 IST

Face to Face: బైడెన్‌, పుతిన్‌ భేటీ!

ఇరు దేశాల సంబంధాలపై చర్చ

జెనీవా: అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ జెనీవా సదస్సులో భేటీ అయ్యారు. ఇరు దేశాల సంబంధాలపై దాదాపు ఐదు గంటలపాటు వీరు చర్చించనున్నారు. వీటితోపాటు పలు అంతర్జాతీయ అంశాలపైనా చర్చించే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడయ్యాక జో బైడెన్‌ తొలిసారి పుతిన్‌తో సమావేశమయ్యారు. అమెరికా, రష్యా దేశాల మధ్య సంబంధాలు దిగజారాయని వస్తోన్న వార్తల నేపథ్యంలో ఇరు దేశాధినేతలు భేటీ కావడంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.

జెనీవాలో జరుగుతున్న ఈ సదస్సుకు స్విట్జర్లాండ్‌ అధ్యక్షుడు గయ్‌ పర్మెలిన్‌ ఇరు దేశాల అధ్యక్షులను ఆహ్వానించారు. మొదటగా జోబైడెన్‌ రష్యా అధ్యక్షుడికి కరచాలనం చేశారు. అనంతరం ఇరు దేశాల దౌత్యాధికారులతో బైడెన్‌, పుతిన్‌లు సమావేశ మందిరంలోకి వెళ్లారు. సుమారు ఐదు గంటలపాటు ఈ సమావేశ కొనసాగనుంది.

ఇదిలాఉంటే, రెండు రోజుల క్రితం బ్రసెల్స్‌లో నాటో ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, చైనా ముప్పుపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో చైనా, రష్యా దేశాలు అనుసరిస్తున్న వైఖరిని బైడెన్‌ తీవ్రంగా తప్పుపట్టారు. ఆ దేశాలు తాము ఆశించిన రీతిలో ప్రవర్తించడం లేదని విమర్శించారు. అంతకుముందు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న కాలంలోనూ జో బైడెన్‌ పుతిన్‌పై తీవ్ర విమర్శలు చేశారు. పుతిన్‌ కూడా అదే స్థాయిలో ప్రతిస్పందించారు. ఇలా ప్రత్యర్థిగా భావించే ఇరు దేశాధినేతలు నేరుగా సమావేశం కావడాన్ని ప్రపంచ దేశాలు ఆసక్తిగా గమనిస్తున్నాయి.


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని