కిమ్‌ చర్యను తేలిగ్గా తీసుకున్న బైడెన్‌..!

తాజా వార్తలు

Published : 25/03/2021 01:11 IST

కిమ్‌ చర్యను తేలిగ్గా తీసుకున్న బైడెన్‌..!

ఇంటర్నెట్‌డెస్క్‌: అమెరికా అధ్యక్ష బాధ్యతలు చేపట్టాక తొలిసారి జో బైడెన్‌ ఉత్తర కొరియాపై స్పందించారు. ఉత్తర కొరియా స్వల్పశ్రేణి క్షిపణి పరీక్షలు నిర్వహించడం వంటి చర్యలను తాను పట్టించుకోనని వెల్లడించారు. దీనిని రక్షణశాఖ అధికారులు యథాతథ పరిస్థితిని కొనసాగించడమంటారని వెల్లడించారు. ఐరాస ఆంక్షల పరిధిలోకి రాని క్రూజ్‌ క్షిపణులను పరీక్షించినట్లు ఇటీవల ఉ.కొరియా ప్రకటించింది. అమెరికా- దక్షిణ కొరియా సంయుక్త సైనిక విన్యాసాలకు స్పందనగా ఈ విషయాన్ని వెల్లడించింది. 

దక్షిణ కొరియా మీడియా వర్గాలు దీనిపై స్పందించాయి. ఆదివారం ఉ.కొరియాలోని ఆన్‌ఛోన్‌ నుంచి రెండు క్రూజ్‌ క్షిపణులను యెల్లోసీలోకి ప్రయోగించారని పేర్కొన్నాయి. దీనిపై మంగళవారం విలేకర్లు బైడెన్‌ను ప్రశ్నించారు. దానికి ఆయన స్పందిస్తూ ‘‘ఏమీ మారలేదని తెలుసుకొన్నాం. ఇదేం మమ్మల్ని భయపెట్టేది కాదు’’ అని  సమాధానం ఇచ్చారు. పొరుగు దేశాలను భయపెట్టేట్లు బాలిస్టిక్‌ క్షిపణి ప్రయోగాలు నిర్వహించడంపై ఐరాస ఆంక్షలను విధించింది. దీనిపై అమెరికా రక్షణ శాఖ అధికారులు విడిగా మాట్లాడుతూ.. ఇలాంటివి సాధారణ సైనిక కార్యకలాపాలేనని పేర్కొన్నారు. ఉత్తరకొరియాతో వ్యవహరించాల్సిన విధానంపై చేపట్టిన సమీక్ష చివరి దశకు చేరిందని వారు తెలిపారు. త్వరలోనే జపాన్‌, దక్షిణ కొరియా దేశాల జాతీయ భద్రతా సలహాదారులతో చర్చిస్తామన్నారు. 


Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని