‘థ్యాంక్స్‌ కేజ్రీజీ.. నా కలను నిజం చేశారు’.. దిల్లీ వీధుల్లో భాజపా నేత పడవపై విహారం

తాజా వార్తలు

Published : 12/09/2021 01:16 IST

‘థ్యాంక్స్‌ కేజ్రీజీ.. నా కలను నిజం చేశారు’.. దిల్లీ వీధుల్లో భాజపా నేత పడవపై విహారం

దిల్లీ: దేశ రాజధాని దిల్లీలో భారీ వర్షాలకు రోడ్లన్నీ జలమయమయ్యాయి. శనివారం కురిసిన భారీ వర్షానికి రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. దీంతో భాజపాకు నేత ఒకరు దిల్లీ నడి వీధుల్లో వర్షపు నీటిలో బోటులో తిరుగుతూ కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. తన కలను నెరవేర్చారంటూ దెప్పిపొడిచారు. వర్షం నీటిలో షికారు చేస్తున్న వీడియోను సామాజిక మాధ్యమాల్లో ఉంచడంతో ఆ వీడియో వైరల్‌ అయ్యింది.

భారతీయ జనతా యువ మోర్చాకు చెందిన తజీందర్‌ పాల్‌ సింగ్‌ బగ్గా ఈ వీడియోను పోస్ట్‌ చేస్తూ తనదైన శైలిలో కేజ్రీవాల్‌ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ‘‘ఈ సీజన్‌లో పడవ విహారం కోసం రిషికేష్‌ వెళ్దామనుకున్నా. కరోనా కారణంగా లాక్‌డౌన్‌ పెట్టడంతో అది వీలు కాలేదు. కానీ, నా కలను నిజం చేస్తూ దిల్లీలోనే ఆ ఏర్పాట్లు చేసిన దిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్‌కు ధన్యావాదాలు చెబుతున్నా’’ అంటూ వీడియోను పోస్ట్‌ చేశారు బగ్గా. ఈ ఘనతను చాటుకుంటూ దిల్లీ నలుమూలాల బోర్డులు పెట్టుకోండి అంటూ వ్యంగ్యంగా అన్నారు. 

మరోవైపు ఎప్పుడూలేని రీతిలో దిల్లీని ఈ ఏడాది వర్షాలు ముంచెత్తాయి. దీంతో నగరంలో చాలా చోట్ల డ్రైనేజీలు పొంగిపొర్లాయి. ఈ ఏడాది ఒక్క సెప్టెంబర్‌ నెలలోనే 383 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. 1944లో 417.3 మిల్లీమీటర్ల వర్షం కురవగా.. మళ్లీ ఆ స్థాయిలో ఈ ఏడాదే వర్షం కురియడం గమనార్హం.  సెప్టెంబర్‌ 1, 2 తేదీల్లో సైతం ఇదే స్థాయిలో దిల్లీలో వర్షం కురిసిన సంగతి తెలిసిందే.



Tags :

మరిన్ని

జిల్లా వార్తలు
బిజినెస్
మరిన్ని
సినిమా
మరిన్ని
క్రైమ్
మరిన్ని
క్రీడలు
మరిన్ని
పాలిటిక్స్
మరిన్ని
జనరల్
మరిన్ని